శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 నవంబరు 2022 (00:03 IST)

19 కొత్త నగరాలకు మొవిన్ దాని ఎక్స్‌ప్రెస్ ఎండ్-ఆఫ్-డే సేవలు

Van
మొవిన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, యుపిఎస్ మరియు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ మధ్యన జాయింట్ వెంచర్, దాని ఎక్స్‌ప్రెస్ ఎండ్-ఆఫ్-డే సేవలను 19 కొత్త నగరాలకు మరియు టౌన్లకు టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో రవాణాలో వేగవంతమైన సమయాన్ని అందిస్తూ, విస్తరించినట్లుగా ప్రకటించింది. ఈ విస్తరణతో మొవిన్ యొక్క ఎక్స్‌ప్రెస్ ఎండ్-ఆఫ్-డే సేవల నెట్‌వర్క్ 47 నగరాలకు తీసుకువెళ్ళబడింది, 3000 పిన్ కోడ్స్ కవర్ చేస్తూ, భార్తదేశంలోని పెద్ద వాణిజ్య ఉత్పాదన మరియు కన్సంప్షన్ అవసరాలు తీరుస్తోంది.
 
ఆపరేషన్స్‌లో ఈ తాజా విస్తరణ దశ, టెక్-డ్రివెన్ ఇన్నోవేషన్స్ ద్వారా మద్దతు ఇవ్వబడుతూ, మొవిన్ యొక్క సేవలను మెట్రోస్‌లోనే కాకుండా టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో బి2బి లాజిస్టిక్స్ ఖాళీలో ఎప్పటికీ-విస్తరిస్తున్న వినియోగదారుల డిమాండ్‌ని తీర్చడానికి వ్యాపిస్తోంది. అలహబాద్, ఔరంగాబాద్, బగ్దొగ్ర, బెల్గాం, డెహ్రాడూన్, గౌహతి, హుబ్లి, జొద్‌పూర్, కొలహాపూర్, మదురై, మైసూర్, నాగపూర్, రాజమండ్రి, రాజ్‌కోట్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, తిరుపతి, ఉదయ్‌పూర్ మరియు వారణాసి ఈ 19 కొత్త నగరాలు.
 
ఇప్పటికే ఉన్న 28 నగరాల్లో అహ్మదాబాద్, అమృత్‌సర్, బరొడా, బెంగళూర్, భోపాల్, భుబనేశ్వర్, ఛండీఘర్, చెన్నై, కొచ్చిన్, కొయంబత్తూర్, ఢిల్లి-ఎన్‌సిఆర్, గోవా, హైద్రాబాద్, ఇందోర్, జైపూర్, జలంధర్, కాన్‌పూర్, కొలకత్తా, లక్నొ, మంగళూర్, పాట్నా, పూణె, రాయ్‌పూర్, రాంచి, సూరత్, విజయవాడ, మరియు విశాకపట్నం కలిసునాయి.
 
జెబి సింగ్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ మరియు మొవిన్‌లో బోర్డ్ సభ్యుడు, అన్నారు "ఈ నగరాల్లోకి మా ప్రెసెంస్‌ని విస్తరించడం అనే నిర్ణయం మా వ్యాపార అభివృద్ధి వ్యూహంలో ఒక తార్కిక అడుగు. భారతదేశంలోని బి2బి వినియోగదారుల పరిమాణం చాలా జెనరేట్ అయ్యే కీలక స్థానాల్లోకి వెళ్ళడం మా ప్రణాళికలో ఒక భాగంగా ఉండింది. ఈ విస్తరణ దశలో మా నెట్‌వర్క్ దేశంలోని వ్యూహాత్మక మార్కెట్స్‌లో కొన్ని జోడించింది ఇది మమ్మల్ని టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి పెరిఫెరల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, హెల్త్‌కేర్, మరియు ఇ-కామర్స్ వంటి సెక్టార్స్‌లో వ్యాపారాలను అన్‌లాక్ చేసుకోడానికి మాకు అనుమతించింది. మా అగ్రగామి-శ్రేణి, పోటితట్వం, మరియు సాంకేతికత-డ్రివెన్ ఎక్స్‌ప్రెస్ మరియు ప్రామాణిక ప్రిమియమ్ సేవల నుండి మా వినియోగదారులు వ్యాపార విలువను గెలుచుకుంటున్నారు.”
 
“మేము మా వినియోగదారులకు పూర్తిగా ప్రిడిక్ట్ చేసుకోగల రోజు మరియు ఖచ్చితంగా డెలివర్ అయ్యే సమయాన్ని అందించడం ద్వారా వ్యూహాత్మక వ్యాపార భాగస్వాములుగా అవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రాంతీయ కేంద్రాలను కలపడానికి Q1 2023 కల్ల 10 వ్యూహత్మక హబ్స్‌ని నిర్మించే దారిలో కూడా మేమున్నాము, ఇవి అంతరాయంలేని సేవను అందించడానికి మా సామర్థ్యాలను పెంచుతాయి", అని జోడిస్తూ శ్రీ సింగ్ చెప్పుకొచ్చారు.