శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (12:50 IST)

డిసెంబర్ 30కి తర్వాత రూ.1000 నోట్లు: చిన్న నోట్లు కూడా మార్కెట్లోకి.. ఆర్బీఐ పక్కా ప్లాన్

పెద్ద నోట్ల రద్దుతో నానా తంటాలు పడుతున్న ప్రజలకు చిల్లర కష్టాలు తీర్చేలా చిన్న నోట్లు వచ్చేస్తున్నాయని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లన్నీ బ్యాంకులకు వెళ్ళిపోగా.. వాటి స్థానంలో ప

పెద్ద నోట్ల రద్దుతో నానా తంటాలు పడుతున్న ప్రజలకు చిల్లర కష్టాలు తీర్చేలా చిన్న నోట్లు వచ్చేస్తున్నాయని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లన్నీ బ్యాంకులకు వెళ్ళిపోగా.. వాటి స్థానంలో ప్రస్తుతం రెండు వేల రూపాయలు మాత్రమే అందుబాటులో వుంది. ప్రస్తుతం 2వేల రూపాయలకు చిల్లర లభించడం కష్టంతో కూడుకున్న పనిగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో రూ.1000 నోటును కూడా డిసెంబర్ 30కి తర్వాత మార్కెట్లోకి వదిలేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేగాకుండా చిన్ననోట్లు కూడా రంగంలోకి వస్తాయని తెలుస్తోంది. ఫలితం కొత్త రూ.20, రూ.50, రూ.100 నోట్లను డిసెంబర్ 30కి తర్వాత మార్కెట్లోకి వదిలేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చినా పాతవి కూడా యథావిధిగా చలామణీలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో..కొత్త నోట్లను సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నోట్లపై ఇందిరమ్మ, భగత్ సింగ్ వంటి అగ్రనేత ఫోటోలు కనిపిస్తున్నాయి.