ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (18:52 IST)

త్వరలో రూ.వెయ్యి నోటు.. రూ.2 వేల నోటుకు చెల్లుచీటి? (video)

దేశ కరెన్సీలో మాయమైన రూ. వెయ్యి నోటు మళ్లీ కనిపించనుందా? అలాగే, ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2 వేల నోటు ఇకపై కనుమరుగుకానుందా? అంటే అవుననే అంటోంది సోషల్ మీడియా. గత 2016 నవంబరు 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 
 
ఆ తర్వాత వాటి స్థానంలో రూ.500 కొత్త నోటు, రూ.2 వేల నోటును చెలామణీలోకి తెచ్చారు. రూ.1000 నోటు మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం త్వరలోనే రూ.వెయ్యి నోటు అందుబాటులోకి రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
అంతేకాదు.. ఆ కొత్త రూ.1000 నోటు ఎలా ఉంటుందో కూడా.. ఓ ఎడిటింగ్ ఫోటోని చూపిస్తూ.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్త వెయ్యి రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రిస్తోందని.. మార్కెట్లోకి విడుదల కూడా చేసిందని పోస్టులు పెడుతున్నారు.

అయితే అది చూసిన జనమంతా నిజమేనేమో అనుకుంటూ.. బ్యాంకులను కూడా సంప్రదించడం మొదలెట్టారు. అక్కడ ఇక్కడ ఈ వార్త వైరల్‌గా మారి.. చివరకు ఆర్బీఐ వరకు చేరుకుంది.
 
వదంతులు వ్యాప్తిచెందుతున్నాయని.. అలర్ట్ అయిన ఆర్బీఐ ఇదంతా అసత్యవార్తలంటూ వివరణ ఇచ్చింది. తాము కొత్త రూ.1000 నోట్ల విడుదల చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.