మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (13:27 IST)

మార్పును అంగీకరించండి... లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే?

అవును. మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా.. వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మీతోనే మీరు పోటీ పడాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మీ ఉన్నతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుందని వారు చెప్తున్నారు. 
 
ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచన ఉన్నప్పుడు రోజూ కొంత సమయాన్ని కేటాయించడం తప్పనిసరి. పనికి పరిధి ఉండదు. అలానే ఒకటే మూసధోరణీ తగదు. మన చుట్టూ వచ్చే మార్పుల్ని గమనించుకుంటూ ముందుకెళ్లాలి. 
 
మనలో బలహీనతల్ని పెంచకోకూడదు. ఎప్పటికప్పుడు మీ పనితీరుని మరింతగా సానపెట్టుకుంటే కోరుకున్న విజయం సొంతం అవుతుందని మానిసిక నిపుణులు సూచిస్తున్నారు.