బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2019 (21:28 IST)

అబ్బాయిలను చూస్తే కొంతమంది అమ్మాయిలు వణికిపోతారు ఎందుకు?

అబ్బాయిలను చూస్తే కొంతమంది అమ్మాయిలు వణికిపోతారు ఎందుకు? వారితో మాట్లాడేందుకు, కలిసి తిరేగేందుకు, సాన్నిహిత్యం పెంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరు చాలామంది అమ్మాయిలు. ముఖ్యంగా చిన్న వయసు నుంచి అబ్బాయిల అబ్బాయిలతో మాట్లాడినా.. చనువుగా నడుచుకున్నా ఈ సమాజం ఏదో అనుకుటుందోనన్న భీతి వారి మనస్సుల్లో ఉంటుంది. 
 
అలాగే, చిన్నప్పటి నుంచి వారు పుట్టిపెరిగిన వాతావారణం కూడా అబ్బాయిలంటే అమ్మాయిలు అయిష్టత ప్రదర్శిస్తుంటారు. ఇలాంటివి ఎన్ని ఉన్నా... పెళ్లీడు వచ్చాక తమకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోక తప్పదు. తమకు ఇష్టంగానో.. తమ తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానో.. మరో కారణంగానో పెళ్లీడు వచ్చిన యువతి వివాహం చేసుకుని తీరాల్సి ఉంటుంది. 
 
ఇలాంటి వారి మనస్సులో అనేక సందేహాలు నిక్షిప్తమై ఉంటాయి. చిన్నప్పటి నుంచి అబ్బాయిలంటే బెరుకు, అయిష్టతను ప్రదర్శిస్తూ వచ్చిన తాము వివాహమైన తర్వాత ఏవిధంగా మసలుకోవాలనే ఆలోచనలు వారి మదిని తొలుస్తుంటాయి. పురుషులంతా ఒకేలా ఉండరన్న విషయాన్ని ప్రతి యువతి గ్రహించాల్సి ఉంటుంది. 
 
ఈ సమాజంలో ఉన్నత విలువతో కూడిన ప్రేమను అందించే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారనే విషయాన్ని గ్రహించాలి. ఇలాంటి వారిలో ఒకరు తమకు పతిగా రావొచ్చని, తమకు భర్తగా రాబోయే వ్యక్తి గుణగణాలను నేటి తరం ఆడపిల్లలు ముందుగానే తెలుసుకుంటూ నివృత్తి చేసుకునేవారు చాలామందే ఉన్నారని చెపుతున్నారు. కాబట్టి పురుషులనగానే వణికిపోవడం అనే సమస్య నుంచి బయటపడాలి.