సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (11:23 IST)

షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరిలకు కట్.. డీడీ నుంచి కొత్త కిడ్స్ ఛానల్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ కిడ్స్ ఛానళ్లను కొరడా ఝుళిపించనున్నారు. పాప్యులర్ కిడ్స్ చానళ్లు అయిన షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరి తదితర విదేశీ అనువాద చానళ్లను వీక్షిస్తున్న చిన్నారులకు భారతీయ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ కిడ్స్ ఛానళ్లను కొరడా ఝుళిపించనున్నారు. పాప్యులర్ కిడ్స్ చానళ్లు అయిన షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరి తదితర విదేశీ అనువాద చానళ్లను వీక్షిస్తున్న చిన్నారులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలను తెలియజేసే విధంగా ప్రత్యేకంగా కిడ్స్ ఛానల్‌ను ప్రారంభించాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులో భాగంగా పూర్తిగా కార్టూన్లతో కూడిన ఛానల్‌ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు దూరదర్శన్ కసరత్తు చేస్తోంది. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో పడింది. 
 
భారతీయ ఇతిహాస కథానాయకులను చిన్నారులకు తెలియజేసేలా.. విదేశీ క్యారెక్టర్లను పక్కనబెట్టే విధంగా కార్యక్రమాలను దూరదర్శన్ రూపొందిస్తోంది. ఈ ఛానల్ ద్వారా భారతీయ జీవనశైలి, ఆహారపు అలవాట్లను పిల్లలు సులభంగా నేర్చుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఈ ఛానల్ ఫ్రీ డిష్ ఛానల్‌గా ప్రసారం అయ్యేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది.