సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (14:02 IST)

పెట్రోల్ బంకుల్లో పాత నోట్ల మార్పిడి గడువును కుదించిన కేంద్రం

పెట్రోల్ బంకుల్లో శుక్రవారం అర్థరాత్రి తర్వాత రద్దు అయిన రూ.500, రూ.1000 నోట్లు చెల్లవు. నిజానికి ఈనెల 15వ తేదీ అర్థరాత్రి వరకు ఈ గడువు ఉంది. అయితే, గడువును శుక్రవారం అర్థరాత్రితో ముగియనుంది.

పెట్రోల్ బంకుల్లో శుక్రవారం అర్థరాత్రి తర్వాత రద్దు అయిన రూ.500, రూ.1000 నోట్లు చెల్లవు. నిజానికి ఈనెల 15వ తేదీ అర్థరాత్రి వరకు ఈ గడువు ఉంది. అయితే, గడువును శుక్రవారం అర్థరాత్రితో ముగియనుంది.
 
నిజానికి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాతనోట్లు ఉన్నవారు ఇబ్బంది పడకుండా కొన్నిచోట్ల అవి చెలామణి అయ్యేలా కేంద్రం కొన్నిరోజులపాటు కొన్ని ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించింది. కాగా, ఆ వెసులుబాటు శుక్రవారం అర్థరాత్రితో ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది.
 
డిసెంబర్‌ 15 వరకు పెట్రోల్‌ బంకులు, విమాన ప్రయాణాలకు రూ.500 నోట్లు చెల్లుతాయని గతంలో కేంద్రం ప్రకటించగా, పెట్రోల్‌ బంకులు, విమానాల్లో డిసెంబర్‌ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.
 
అలాగే, శుక్రవారం అర్థరాత్రి నుంచి టోల్‌ రుసుములు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. టోల్‌ రుసుములను డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.