శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (10:29 IST)

45,000 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదు.. నిజమా?

mobile massage
దేశంలో 45వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. పలు నగరాల్లో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, 45 వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సాంకేతికత అందలేదని సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఇంకా ఎన్ని గ్రామాలకు 4జీ టెక్నాలజీ అందించాల్సి ఉందన్న ఎంపీ ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. 
 
దేశంలోని 93 శాతం గ్రామాలు 4జీ సేవలను కలిగి ఉన్నాయని, 45 వేల గ్రామాలకు ఇంకా 4జీ సేవలు అందించాల్సి ఉందని, ఒడిశాలో అత్యధికంగా 4జీ సేవలు లేని గ్రామాలున్నాయని పేర్కొంది. 
 
ఇప్పటికీ చాలా గ్రామాల్లో 4జీ సేవలు అందుబాటులో లేకపోయినా, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం గమనార్హం.