శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (11:25 IST)

భయపెడుతున్న పెట్రోల్ ధరలు...

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు భయపడిపోతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి పెరిగినా గగ్గోలు పెట్టిన నేటి బీజేపీ పాలకులు... ఇపుడు విపరీతంగా పెరిగిపో

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు భయపడిపోతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి పెరిగినా గగ్గోలు పెట్టిన నేటి బీజేపీ పాలకులు... ఇపుడు విపరీతంగా పెరిగిపోతున్నా నోరుమెదపకుండా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
6 నెలల క్రితం అత్యధికంగా రూ.75 చేరింది. ఈ క్రమంలో కేంద్రం చర్యలు తీసుకుని.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించటంతో కొంత ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజూ 5, 10 పైసలు పెరుగుతూ, తగ్గుతూ 2018, జనవరి 2వ తేదీకి రూ.74.10పైసలు, డీజిల్ రూ.64.79కి చేరింది. 
 
ఇదిలావుంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముడి చమురు ధరలను పెంచింది. బ్యారల్ పై 4 శాతం పెరుగుదల ఉంది. ఈ పెంపు కూడా స్వదేశీ మార్కెట్‌పై పడనుంది. ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఆయిల్‌పై ఈ ధరల ప్రభావం లేకున్నప్పటికీ రాబోయే వారం, 10 రోజుల్లో అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనంపై కొత్త ధరల ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.