శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:48 IST)

కొండెక్కిన ఉల్లి ధరలు … 220 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. ఫలితంగా కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకూ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. ఫలితంగా కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకూ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదికి ఈ యేడాదికి పోల్చుకుంటే 220శాతం పెరిగాయి. గతేడాది డిసెంబర్ లో 15 రూపాయలున్న ఉల్లిపాయలు.. ఇప్పుడు 50 రూపాయలకు చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక వర్షాలే. 
 
ముఖ్యంగా, ఉల్లి ఎక్కువగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పడిన అధిక వర్షాలే దీనికి కారణమని వారు అంటున్నారు. అలాగే, ఉల్లిని పండించే మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా పడటం కూడా మరోకారణంగా ఉంది. ఇపుడు కేవలం మధ్యప్రదేశ్ నుంచి మాత్రమే ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయి. ద 
 
అధిక ధరల సమస్య కేవలం ఉల్లిపాయలది మాత్రమే కాదని… టమాటో, క్యారేట్, క్యాబేజీ, బీన్స్, కాకరకాయలు వంటి ఇతర కూరగాయలు ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. 2016 డిసెంబరులో కేజీ టమాటా ధర రూ.8లు ఉంటే… ప్రస్తుతం రూ.26కి చేరిందన్నారు. 
 
మరోవైపు, వ‌రుస‌గా కొన్ని రోజుల నుంచి ప‌డిపోతూ వ‌స్తోన్న ప‌సిడి ధ‌ర శుక్రవారం కాస్త పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోవ‌డంతో 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ.230 పెరిగి రూ.29,665గా న‌మోదైంది. కాగా, వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించి రూ.680 పెరిగి, కిలో వెండి ధర రూ.38,280గా న‌మోదైంది.