శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (16:55 IST)

పియాజ్జియో ఇండియా నుంచి త్వరలో ప్రీమియం స్కూటర్‌ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160

భారతదేశంలో నూతన ప్రీమియం స్కూటర్‌ను ఆవిష్కరించే లక్ష్యంతో తమ మహోన్నతమైన వినియోగదారులకు సేవలను అందించనుండటం కోసం పియాజ్జియో ఇండియా త్వరలోనే తమ బారామతి కర్మాగారంలో తమ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఉత్పత్తిని ఆరంభించబోతుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రీమియం ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను మొట్టమొదటిసారిగా గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించారు.
 
ఆటో ఎక్స్‌పో వద్ద అత్యున్నత ప్రశంసలు పొందిన స్కూటర్‌గా ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 తొలిసారిగా శైలి, పనితీరు మరియు అసాధారణ సౌకర్య సవారీ అనుభవాల సమ్మేళనంగా వస్తుంది. భారతదేశం కోసం ఇటలీలో డిజైన్‌ చేయబడిన ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఇప్పుడు నూతన బెంచ్‌మార్క్‌ను తమ వినూత్నమైన రేపటి తరాన్ని ఆకట్టుకునే సౌందర్యం, సాంకేతికంగా అత్యాధునిక ఫీచర్లతో సృష్టించనుంది.
 
ఏప్రిలియా యొక్క అంతర్జాతీయ డిజైన్‌ భాషను జొప్పించుకున్న ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160, అత్యున్నత ప్రీమియం అనుభవాలను అసాధారణ పనితీరు, సౌకర్యం మరియు శైలితో అందిస్తుంది. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఇప్పుడు ప్రీమియం స్కూటర్‌ మార్కెట్‌లో నూతన విభాగాన్ని సృష్టించనుంది. దీనిలో అత్యున్నత పనితీరు కలిగిన 160సీసీ బీఎస్‌ 6, మూడు వాల్వ్‌ల ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ స్వచ్ఛమైన ఉద్గారాల ఇంజిన్‌ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత శక్తి మరియు టార్క్‌ను అసాధారణ సవారీ అనుభవాలతో అందిస్తుంది.
 
దీని యొక్క వినూత్నమైన , పోల్చలేనటువంటి లుక్‌ను 3 కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినీష్‌ కాంప్లిమెంట్‌ చేస్తుంది. ఇది ఏప్రిలియా యొక్క సిగ్నేచర్‌ గ్రాఫిక్స్‌ను మాట్‌ బ్లాక్‌ డిజైన్‌ ట్రిమ్స్‌తో జత కలుపుతుంది. అదే సమయంలో డార్క్‌ క్రోమ్‌ ఎలిమెంట్స్‌ కూడా జోడించబడ్డాయి. పదునైన బాడీ లైన్స్‌, జామ్రెటిక్‌ కాంటూర్స్‌, అత్యున్నత పనితనం వంటివి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 యొక్క శక్తివంతమైన ప్రీమియం అప్పీల్‌ అందిస్తుంది. వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌ మరియు ఐ లైన్‌ పొజిషన్‌ లైట్స్‌ వంటివి ఫ్రంట్‌ ఇండికేటర్‌ బ్లింకర్స్‌తో  కలిసిపోవడంతో పాటుగా దీని వినూత్నమైన లైట్‌ ప్లే సృష్టిస్తాయి.  ఇంటిగ్రేటెడ్‌ వెనుక బ్లింకర్స్‌ తో డైమండ్‌ రిఫ్లెక్షన్‌ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టైల్‌ లైట్లు అవసరమైన నూతన తరపు అప్పీల్‌ను అందిస్తాయి.
 
అత్యుత్తమ సవారీ అనుభవాలను అందించడంతో పాటుగా అత్యున్నత స్థాయి సౌకర్యం అందించేందుకు ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 పెద్దదైన, పొడవైన, సౌకర్యవంతమైన మరియు సౌందర్యంతో కూడిన సీట్లను లెదర్‌ స్యూడ్‌ ఫీల్‌తో అందిస్తాయి. ఇవి ప్రత్యేకంగా కుట్టిన గ్రే మరియు ఎరుపు దారాల్లో ఉంటాయి,. సౌందర్యపరంగా చక్కగా ఉంచిన మరియు సౌకర్యవంతంగా పెంచిన స్టీరింగ్‌ హ్యాండిల్‌ బార్‌తో పాటుగా ఫీదర్‌ టచ్‌ స్విచ్‌లు సవారీ సమయంలో ఎలాంటి అసౌకర్యానికీ గురికాకుండా సవారీదారు స్విచ్‌లను వినియోగించుకునేందుకు అవకాశం  కల్పిస్తుంది.
 
చక్కగా అమర్చిన సీటింగ్‌ అవసరమైనప్పుడు రైడర్‌ తన పాదాలను నేలపై తాకించేందుకు వీలు కల్పిస్తుంది. అదే రీతిలోవాహనం నెమ్మదించడానికి, సిగ్నల్స్‌ వద్ద ఆగడానికీ అనుకూలంగా ఉంటుంది. అదనంగా, డ్యూయల్‌ టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌ మరియు మార్చుకోతగిన రియర్‌ సస్పెన్షన్‌ వంటివి మృదువైన సవారీకి  అనుమతిస్తాయి. అయితే ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను విభిన్నమైన రహదారులపై ఉపయోగించుకోవాలనుకునే రైడర్లు ఈ సస్పెన్షన్‌ను మార్చుకోవచ్చు.
 
భారీ 210 చదరపు సెంటీమీటర్ల  మల్టీ ఫంక్షనల్‌ ఆల్‌ డిజిటల్‌ క్లస్టర్‌ను కలిగిన ఈ వాహనంలో బహుళ ఫీచర్లు సైతం ఉన్నాయి. వినియోగదారులు మొబైల్‌ కనెక్టివిటీ యాక్ససరీను సైతం ఎంచుకోవచ్చు. ఇది వినియోగదారుల మొబైల్‌ను స్కూటర్‌కు అనుసంధానిస్తుంది మరియు వారికి దానిని లొకేట్‌ చేయడం, అవసరమైనప్పుడు సెక్యూరిటీ అలారం మోగించడం, ఆఖరకు కదలకుండా చేయడమూ చేస్తుంది. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 వాహనాలు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌)తో వస్తాయి. వీటితో పాటుగా వెంటిలేటెడ్‌ డిస్క్‌ బ్రేక్‌ మరియు ట్విన్‌ పోర్ట్‌ కాలిపర్‌ హైడ్రాలిక్‌ బ్రేక్స్‌ వంటివి అసాధారణ బ్రేకింగ్‌ పనితీరు అందిస్తాయి.
 
ఈ సందర్భంగా శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ, ‘‘అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరియు వినూత్నమైన ప్రీమియం ప్రతిపాదనను మా మహోన్నతమైన వినియోగదారుల కోసం అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆటో ఎక్స్‌పో 2020 వద్ద వాగ్ధానం చేసినట్లుగా,  ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఉత్పత్తిని భారతదేశంలో చేయబోతున్నాం.
 
ఇది సాటిలేని అనుభవాలను అత్యంత సృజనాత్మక డిజైన్‌, ప్రీమియం శైలి, అత్యధిక సౌకర్యం, ఉన్నత శ్రేని పనితీరుతో అందిస్తుంది, స్కూటర్‌ విభాగంలో నూతన  అధ్యాయాన్ని ఇది సృష్టించనుంది. ఈ అనుభవాలను ప్రతి ఒక్కరికీ మరింత దగ్గరగా తీసుకురాగలమనే భరోసాను అందించడంతో పాటుగా భారతదేశంలో మా డీలర్‌నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం ద్వారా మా చేరికనూ విస్తరించనున్నాం. తమ పట్టణాలలో అత్యంత ఉత్సాహపూరితమైన  వ్యాపార నమూనా  తీసుకురావాలనే ఆలోచన కలిగిన వ్యవస్థాపకులను స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.
 
వినియోగదారులకు అత్యున్నత ప్రీమియంఉత్పత్తులు మరియు కొనుగోలు అనుభవాలను అందించడం ద్వారా సౌకర్యంకు భరోసా అందిస్తున్న పియాజ్జియో ఇండియా అతి స్వల్పకాలంలోనే 250 డీలర్‌షిప్‌లు ఏర్పాటుచేసింది మరియు ఈ నెట్‌వర్క్‌ను 400కు పైగా డీలర్‌షిప్‌లు పెంచనుంది.