రానున్న రోజుల్లో తగ్గనున్న వంట నూనె ధరలు
వంట నూనె ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముంది. వంట నూనె దిగి వస్తే.. చాలా మంది ఊరట కలుగుతుంది. మరీముఖ్యంగా సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. వంట నూనె ధర గత ఏడాది కాలంలో రూ.55కు పైగా పెరిగింది. ఇప్పుడు లీటరు పామ్ ఆయిల్ ధర రూ.150కు చేరింది. దీంతో సామాన్యులపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. రూ.150 తీసుకెళ్తే లీటరు ఆయిల్ రావడం లేదు. దీంతో సామాన్యుల జేబులకు పెద్ద చిల్లు పడిందని చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు వంట నూనె ధర తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్‌లలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీని వల్ల ధరలు తగ్గే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.