గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (14:37 IST)

రైల్వే ప్రయాణికులకు కొత్త సంవత్సర శుభవార్త

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఓ శుభవార్త చెప్పింది. దేశంలో నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే శాఖ సొంతగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ కార్డుల తయారీ కోసం భారతీయ స్టేట్ బ్యాంకుతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రైల్వే అనుబంధ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లను ఈ డెబిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 
ఇలా బుక్ చేసుకుంటే నెలలో ఒకసారి లాటరీ తీసి 10 మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు.