శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:07 IST)

నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు డిపాజిట్ చేశారా? ఆర్బీఐ నిబంధన

నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత

నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలు అంతకన్నా ఎక్కువ డబ్బును జమ చేసిన వారు, రూ.5 లక్షలకుపైగా డబ్బు ఉన్న ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకొనేందుకు పాన్‌ నంబరును తప్పనిసరిగా సమర్పించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాన్‌ లేకుంటే ఫాం 60 సమర్పించాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన నగదు బదిలీకి కూడా వర్తిస్తుందని పేర్కొంది. 
 
అలాగే, జన్‌ధన్‌ ఖాతాదారులు మాత్రం రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేసినప్పటికీ... వారికి ప్రతి నెలా రూ.10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కొన్ని బ్యాంకుల్లో కేవైసీ నిబంధనలను పాటించడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు విధించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై పైన పేర్కొన్న ఖాతాల్లో ప్రతి లావాదేవీకీ పాన్‌ను తప్పనిసరిగా కోట్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.