ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (17:58 IST)

షాక్... రూ. 2000 నోట్లను రద్దు చేస్తారా ఏంటి? ముద్రించడం ఆపేశారండీ...

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.500, రూ.1000 పాత నోట్ల చెల్లవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై పాత నోట్ల స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. అప్పట్లో నోట్ల కొరతను అధిగమిం

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.500, రూ.1000 పాత నోట్ల చెల్లవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై పాత నోట్ల స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. అప్పట్లో నోట్ల కొరతను అధిగమించేందుకు రూ.7.4 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ప్రస్తుతం ప్రజల మధ్య 15.22 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 
 
కొత్తగా రూ.200 నోట్ల ముద్రణ ప్రారంభం కావడంతో రూ.2వేల నోట్ల ప్రింట్లను ఆర్బీబీ ఆపివేసింది. వచ్చే నెల రూ.200 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. అలాగే నోట్ల కొరతకు చెక్ పెట్టేలా రూ.500 నోట్ల ముద్రణ కూడా శరవేగంగా జరుగుతోంది.
 
దీంతో తాత్కాలికంగా రూ.2వేల నోట్ల ముద్రణను ఆపివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మైసూరులోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో రూ.200 నోట్ల ముద్రణ జరుగుతుందని.. ఈ నోట్లు ఏటీఎంల్లో ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆర్బీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.