మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:16 IST)

అసోం పంట పండింది... ముకేష్ అంబానీ ఏం చేస్తున్నారో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్, పెట్రోలియం, పర్యాటకం, క్రీడలు.. తదితర విభాగాల్లో పెట్టనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో కనీసం 80 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అసోంలో ప్రస్తుతం వున్న 27 పెట్రోలు డిపోలతో పాటు ఆ సంఖ్యను 165కి పెంచబోతున్నట్లు తెలిపారు.