శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (10:45 IST)

అస్సోంలో రూ.121 కోట్ల ప్రింటింగ్ స్కామ్ : ఐఏఎస్‌ అధికారి అరెస్టు

అస్సోంలో రూ.121 కోట్ల ప్రింటింగ్ స్కామ్‌లో ఓ ఐఏఎస్‌ అధికారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2013 నుంచి 2017 మధ్య ఐఏఎస్‌ అధికారి చౌహాన్‌ డోలీ కార్మిక కమిషనర్‌గా ఉన్న సమయంలో.. ముద్రణ కాంట్రాక్టులను

అస్సోంలో రూ.121 కోట్ల ప్రింటింగ్ స్కామ్‌లో ఓ ఐఏఎస్‌ అధికారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2013 నుంచి 2017 మధ్య ఐఏఎస్‌ అధికారి చౌహాన్‌ డోలీ కార్మిక కమిషనర్‌గా ఉన్న సమయంలో.. ముద్రణ కాంట్రాక్టులను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో అరెస్టు చేశారు. 
 
ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్‌ విభాగం (ఎస్‌వీసీ).. మంగళవారం చౌహాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చౌహాన్‌ ఓ ఆసుపత్రిలో చేరారని.. అక్కడి నుంచి విజిలెన్స్‌ కార్యాలయానికి ఆయనను తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాంట్రాక్టులు పొందిన సంస్థ యజమాని పియాంగ్షు బైరాగిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.