సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (15:48 IST)

ఇద్దరు పిల్లలను ఓవెన్‌లో పెట్టి చంపేసిన తల్లి... ఎందుకు?

అమెరికాలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను ఓవెన్‌లో ఉంచి చంపేసింది ఓ కసాయి తల్లి. చంపడమే కాదు.. ఆ తతంగాన్ని వీడియో తీసి తన భర్తకు పంపింది కూడా. ఈ క్రూరమైన ఘటన అట్లాంటలోని ఓక్లాండ్ సిటీలోని వెస్ట్‌ఎ

అమెరికాలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను ఓవెన్‌లో ఉంచి చంపేసింది ఓ కసాయి తల్లి. చంపడమే కాదు.. ఆ తతంగాన్ని వీడియో తీసి తన భర్తకు పంపింది కూడా. ఈ క్రూరమైన ఘటన అట్లాంటలోని ఓక్లాండ్ సిటీలోని వెస్ట్‌ఎండ్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ (24) ఉండగా, ఈమె భర్త జమీల్‌ పెన్ ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో నివశిస్తూ వచ్చింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలను ఓవెన్‌లో ఉంచి స్విచాన్ చేసి.. భర్తతో వీడియో కాల్‌లో చాట్ చేయసాగింది. 
 
దీన్ని గమనించిన భర్త... తన ఇద్దరు పిల్లలకు ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించిన తండ్రి వెంటనే అట్లాంట పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చే లోపే పిల్లలు మాంసం ముద్దలుగా మారిపోయారు.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆమె తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నదని చెప్పారు. గతంలోనూ చేతిని కోసుకోవటం వంటి పనులు చేసేదని చెప్పారు. అయితే, మానసిక వ్యాధితో బాధపడుతున్న తల్లి దగ్గర పిల్లలను ఒంటరిగా భర్త ఎలా వదిలిపెట్టాడు అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.