శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By IVR
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2016 (15:15 IST)

యాక్సిస్ బ్యాంకు లైసెన్స్ క్యాన్సిల్ అంటూ రూమర్లు... కొట్టిపారేసిన ఆర్బీఐ

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ప్రాంతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ దహియా మాట్లాడుతూ... ఈ కథనాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆర్బీఐ నిబంధ

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ప్రాంతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ దహియా మాట్లాడుతూ... ఈ కథనాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి మా వినియోగదారులకు యాక్సిస్ బ్యాంకు మెరుగైన సేవలను అందిస్తోంది.
 
ఈ సందర్భంగా మా బ్యాంకు ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు, సభ్యులకు, ప్రజలకు తెలియజేసేదేమంటే... మా బ్యాంకు విధానాలు, లావాదేవీలు అన్నీ అత్యంత పారదర్శంగానూ, అత్యంత ఉన్నత విలువలతోనూ, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అన్నివేళల్లోనూ తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు అహరహం కృషి చేస్తుంటామని వెల్లడించారు. 
 
మరోవైపు ఆర్బీఐ కూడా యాక్సిస్ బ్యాంకు గురించి వచ్చిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. యాక్సిస్ బ్యాంకు లైసెన్స్ రద్దు అంటూ ప్రచారమైన వార్తలన్నీ అవాస్తవమని ఆర్బీఐ స్పష్టీకరించింది.