సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (15:29 IST)

బ్లూ క్యాప్‌తో కూడిన వైట్ కలర్ పెన్ను.. కథ కంచికేనా?

Reynolds
Reynolds
గత కొన్నేళ్లుగా పెన్నుల తయారీలో రాటు తేలిన రెనాల్ట్ కంపెనీ.. పెన్నుల తయారీని నిలిపివేయబోతోందన్న ప్రచారానికి రెనాల్ట్ యాజమాన్యం తెరపడేలా చేసింది. 90వ దశకంలో పాఠశాల విద్యార్థులకు రేనాల్డ్స్ పెన్ కొనడం అనేది ఒక కల. ఎన్నో ఏళ్లుగా రెనాల్డ్స్ సంస్థ పలు రంగులు, మోడల్స్‌లో పెన్నులు ఉత్పత్తి చేస్తుండటం విశేషం. 
 
ముఖ్యంగా బ్లూ క్యాప్‌తో కూడిన వైట్ కలర్ పెన్ను ఎన్నో ఏళ్లుగా చిన్నారుల మదిలో మెదులుతోంది. 1945 నుంచి పెన్నులు తయారు చేస్తున్న కంపెనీ.. ఇప్పుడు పెన్ను వాడకం తగ్గిపోవడంతో పెన్నుల తయారీకి స్వస్తి పలకబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పుకారు ఆగేది లేదని, అది పూర్తిగా అబద్ధమని రేనాల్డ్స్ కంపెనీ స్పష్టం చేసింది.