శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 30 జూన్ 2017 (15:59 IST)

GST... రూ. 5 లక్షల కారు కొనేవారికి రూ.5 వేలు తగ్గింపట... హిహ్హిహ్హ్హీ....

జీఎస్టీ పన్నుపై సెటైర్లు మామూలుగా వుండటంలేదు. అటు మధ్యతరగతి వారికి వాతలు పెట్టేస్తున్న జీఎస్టీ సంపన్న వర్గాల వారికి ఫన్నీగా మారుతోందంటున్నారు. సహజంగా కారు కొనే స్టేటస్ సంపన్నవర్గాల వారికే వుంటుంది. మధ్యతరగతి, సామాన్యులు కార్ల జోలికి వెళ్లే పరిస్థితి

జీఎస్టీ పన్నుపై సెటైర్లు మామూలుగా వుండటంలేదు. అటు మధ్యతరగతి వారికి వాతలు పెట్టేస్తున్న జీఎస్టీ సంపన్న వర్గాల వారికి ఫన్నీగా మారుతోందంటున్నారు. సహజంగా కారు కొనే స్టేటస్ సంపన్నవర్గాల వారికే వుంటుంది. మధ్యతరగతి, సామాన్యులు కార్ల జోలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు జీఎస్టీ అమలుతో ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, ఎలైట్ వంటి కార్లపై రూ. 5 వేల నుంచి రూ.6 వేల వరకూ తగ్గింపు వుంటుందట. 
 
జీఎస్టీతో ఇది సాధ్యమైందని అంటున్న నేతల మాటలను చూసి నవ్వుకుంటున్నారు. ఐదారు లక్షల రూపాయలు పెట్టి కారు కొనేవారికి రూ. 5 వేలు ఓ లెక్కా అని ఫక్కుమంటున్నారు. ఇకపోతే ఆరోగ్య బీమా, జీవిత బీమా చేసుకున్న సామాన్య తరగతికి మాత్రం జూలై నెల నుంచి పన్ను బాదుడు వుంటుందని ఆయా కంపెనీలు సందేశాలు పంపిస్తున్నాయి. అంతా జీఎస్టీ నమో నమః. మున్ముందు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో వెయిట్ అండ్ సీ.