గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 జులై 2021 (16:02 IST)

కరువు భూమి ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు అధిరోహణం: రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌

‘తెలంగాణా రాష్ట్రంలో కరువు భూముల ఆహార వ్యవస్థలు’ అంటూ ఓ పరిశోధనా పత్రాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు 2021లో భాగంగా రోమ్‌లో జూలై 26-28, 2021 నడుమ జరుగుతున్న ముందస్తు శిఖరాగ్ర సదస్సులో రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) సమర్పించింది. ఈ పత్రంలో భారతదేశంలో మెట్ట ప్రాంతాల వ్యవసాయ వ్యవస్థలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వెల్లడించారు. ఈ పత్రాన్ని ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద సెమీ-అరిడ్‌ ట్రాపిక్స్‌ (ఇక్రిశాట్‌) భాగస్వామ్యంతో ప్రచురించారు.
 
ఈ ముందస్తు శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 2021లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల సదస్సునకు తీసుకువెళ్లనుంది. ఈ కార్యక్రమం 2030 నాటికిసస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌జీడీలు) చేరుకోవాలనే ‘దశాబ్ద కాలపు చర్య’లో భాగంగా జరుగుతుంది.
 
మెట్టప్రాంతాల వ్యవసాయ వ్యవస్థలలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రిచ్‌, ఆన్‌లైన్‌ చర్చను 16 జూలై 2021వ తేదీన నిర్వహించింది. విస్తృతస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధులు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ), పరిశోధకులు, పౌర సమాజ సంస్థలు, వ్యవసాయ పరిశ్రమ సభ్యలు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ చర్చల్లోని కీలకాంశాలను విశ్లేషించి, ఈ పత్రంలో పొందుపరచడంతో పాటుగా యుఎన్‌ ప్రీ సమ్మిట్‌లో సమర్పించారు. ఈ చర్చలో పాల్గొన్న కీలక వ్యక్తులలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌; ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జాక్విలిన్‌ డీర్రాస్‌ హ్యుస్‌ మరియు రిచ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్‌ పాల్గొన్నారు.
 
ఈ ముందస్తు శిఖరాగ్ర సదస్సు, యువత, రైతులు, పౌర సమాజం, విధాన నిర్ణేతలు, వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం తదితర రంగాలకు చెందిన వ్యక్తులకు ఏకీకృత వేదికనందిస్తుంది. అంతర్జాతీయంగా ఆహార వ్యవస్థల మార్పుకు సంబంధించి తాజా నిరూపిత ఆధారిత మరియు శాస్త్రీయ పద్ధతులను అందించడాన్ని ఇది లక్ష్యంగా చేసుకుంది.
 
స్ఫూర్తిదాయక సదస్సులో కీలకమైన వాటాదారులు అత్యంత కీలకమైన అంశాలను వెల్లడించారు. గ్రామస్థాయిలో విత్తన బ్యాంకులను సృష్టించడం, ప్రాధమిక స్థాయిలో జ్ఞానం పెంపొందించడం, ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతికతలను చేర్చడం వంటివి వీటిలో ఉన్నాయి. దిగుబడుల లోపాలు, వాతావరణ మార్పుల ప్రభావంకు సంబంధించి సమస్యల పరిష్కారంలో సాంకేతిక స్వీకరణ గురించి కూడా వాటాదారులు నొక్కి చెప్పారు.