1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (23:19 IST)

నూతన ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్‌: 50 ఏళ్ల దాకా భద్రమైన హామీపూర్వక ఆదాయం

savings
ఫ్యూచర్ జెనెరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్ జిఐఎల్ఐ) తన తాజా ఉత్పాదన ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ఉత్పాదన సంప్రదాయక, నాన్- పార్టిసిపేటింగ్, దీర్ఘకాలిక హామీపూర్వక సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది దిగువ విశిష్టతలను కలిగిఉంది.
 
క్రమం తప్పని మరియు దీర్ఘకాలిక ఆదాయాన్ని 50 ఏళ్ల వరకు అందిస్తాయి. ఎంత త్వరగా అంటే, పాలసీని కొనుగోలు చేసిన 1వ పాలసీ నెల నుంచే ఆదాయం మొదలవుతుంది. అంతేగాకుండా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా ఆదాయ ప్రయోజనాలను 5 ఏళ్ల తరువాత ఆరంభించుకునే వెసలుబాటు కూడా ఉంది.
 
సర్వైవల్ బెనిఫిట్స్‌లో హామీపూర్వక పెరుగుదల, ఆరంభ ప్రయోజనంలో 50% దాకా, 11వ సంవత్సరం నుంచి చివరి చెల్లింపు దాకా ప్రతీ 5 ఏళ్లకు.
 
పాలసీ కాలవ్యవధి అంతా కూడా మరణానికి సంబంధించి జీవిత బీమా వర్తిస్తుంది, ఆదాయం చెల్లింపులను పొందుతున్నప్పటికి కూడా.
 
పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పటికీ, కుటుంబం భవిష్యత్ ప్రీమియంలు చెల్లించకుండానే ఆదాయం పొందడాన్ని కొనసాగించుకునే ఆప్షన్. డెత్ క్లెయిం సెటిల్ అయిన వెంటనే డెత్ సమ్ అస్యూర్డ్ చెల్లించబడు తుంది. కుటుంబానికి హామీపూర్వక ఆదాయం కొనసాగించబడుతుంది. భవిష్యత్ ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ చివరి తేదీన మెచ్యూరిటీ మొత్తం కూడా చెల్లించబడుతుంది.
 
ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ ముఖ్యాంశాలు:
 
30, 40 లేదా 50 ఏళ్లకు (పాలసీ టర్మ్) జీవిత బీమాతో హామీపూర్వక దీర్ఘకాలిక ఆదాయం
 
ప్రీమియం చెల్లింపు బాధ్యత 8 లేదా 10 ఏళ్లకు పరిమితం
 
మెచ్యూరిటీ సందర్భంగా హామీపూర్వక ఏకమొత్తం, చెల్లించిన ప్రీమియంలకు రెట్టింపుగా
 
ఆదాయం ప్రారంభం కావాల్సిన తేదీని ఎంచుకునే వీలు, అది తక్షణమే అంటే, తదుపరి నెల లేదా తదుపరి త్రైమాసికం లేదా తదుపరి సంవత్సరం కావచ్చు లేదా దాన్ని వాయిదా వేయవచ్చు, అంటే అధిక ఆదాయ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా 5 పాలసీసంవత్సరాలు గడిచిన నాటి నుంచి ఎంచుకోవచ్చు.
 
ఇన్ కమ్ లాయల్టీ యాడిషన్స్ ద్వారా సర్వైవల్ ప్రయోజనాలను అధికం చేయడం. అది 11వ పాలసీ సంవత్సరం నుంచి ప్రతీ 5 ఏళ్లకు ఓసారి చెల్లించే ఆదాయాన్ని అధికం చేస్తుంది.
 
కుటుంబం కోసం ఆదాయ ప్రయోజనాలు మరియు మెచ్యురిటీ ప్రయోజనాలు పొందే వీలు, పాలసీదారు మరణించి నప్పటికీ భవిష్యత్ ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేకుండా
 
అమల్లో ఉన్న పన్ను చట్టాలను బట్టి పన్ను ప్రయోజనాలు
 
ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఫ్యూచర్ జెనెరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అపాయింటెడ్ యాక్చువరి, చీఫ్ రిస్క్ ఆఫీసర్ శ్రీ బికాశ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘నేడు బీమా మార్కెట్ లో హామీపూర్వక ఆదాయ ప్లాన్ లకు ఆదరణ పెరుగుతోంది. జీవన వ్యయాలు పెరిగిపోవడాన్ని పరి గణన లోకి తీసుకుంటే, దీర్ఘకాలిక ఆదాయ ప్లాన్ అనేది క్రమం తప్పని ఆదాయాన్ని అందించడం మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక వ్యయాల పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటుంది. కస్టమర్లకు వివిధ జీవిత బీమా పరిష్కారాలను అందించాలనే మా ప్రయాణంలో వారి భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పడేందుకు వీలుగా ఫ్యూచర్ జెనెరాలీ లాంగ్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్ ఆదాయంలో పెరుగుదలను అందిస్తుంది, 11వ ఏడాది నుంచి మొదలుకొని, ఆ తరువాత ప్రతీ 5 ఏళ్లకోసారిగా, 50 ఏళ్ల పాటు. కస్టమర్లు భద్రతాభావంతో ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకే, అనుకోని సంఘటన జరిగితే, పాలసీదారు మరణిస్తే, భవిష్యత్ ప్రీమియంలను కూడా రద్దు చేస్తాం. దీంతో కస్టమర్లు ఇప్పుడు తాము అభిమానించే వారికి హామీపూర్వక ఆదాయాలకు టర్మ్ అంతా కూడా భద్రత కల్పించగలుగుతారు’’ అని అన్నారు.
 
కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేవి, పొదుపు మొత్తాలకు రక్షణ కల్పించేవి, వివిధ పెట్టుబడులకు వీలు కల్పించేవి, పిల్లల చదువుకు భద్రత కల్పించేవి, ఆరోగ్య బీమాను అందించే, రిటైర్ మెంట్ ప్లానింగ్ ను ఇచ్చేవి, ఇలా మరెన్నో ఆప్షన్లను ఫ్యూచర్ జెనెరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. కంపెనీ పోర్ట్ ఫోలియోలో కస్టమర్లు తమ జీవితం లోని వివిధ దశల్లో ఎంచుకునేందుకు వీలైన, పరిశ్రమలోనే ఎంతగానో ప్రముఖంగా ఉన్న పాలసీలు ఎన్నో ఉన్నాయి.