శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (23:22 IST)

సామాన్యులకు మరో షాక్... కొత్త గ్యాస్ కనెక్షన్ ఖరీదు

lpg cylinder
సామాన్యులకు మరో షాక్. కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం ఖరీదుగా మారింది. ఇప్పటికే దేశీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్‌ రేట్లను పెంచిన ఇంధన కంపెనీలు.. తాజాగా వాణిజ్య కనెక్షన్ల రేట్లను కూడా భారీగా పెంచాయి. 
 
19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.1150, 47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ పై రూ. 900 పెంచాయి ఇంధన కంపెనీలు కొత్త రేట్లు మంగళవారం (జూన్ 28,2022) నుంచే అమలులోకి వస్తాయి.
 
కొత్త రేట్ల ప్రకారం..ఇప్పుడు వినియోగదారులు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.3600కి చెల్లించాల్సి ఉంటుంది. 47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ కోసం రూ. 7350,సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. 
 
జూన్ 16న నాన్ కమర్షియల్ వంట గ్యాస్ డిపాజిట్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇంధన కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే.