శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (10:35 IST)

కాంగ్రెస్ నేత చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు

chidambaram
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలకు దిగింది. చిదంబరం నివాసాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. ముఖ్యంగా, చిదంబరంకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైతో పాటు ఏడు చోట్ల ఈ తనిఖీలు సాగుతున్నాయి. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్తీ చిదంబరంపై సీబీఐ ఇటీవల కేసును కూడా నమోదు చేసింది. అయితే, సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.