1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (09:49 IST)

మరో భారం : వంట గ్యాస్ సిలిండర్ డిపాజిట్ భారీగా పెంపు

lpg cylinder
దేశ ప్రజలపై చమురు సంస్థలు మరో భారాన్ని మోపాయి. ఇప్పటికే పెట్రోల్, డీజల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిన చమురు కంపెనీలు ఇపుడు వంట్ గ్యాస్ సిలిండర్ డిపాజిట్లను కూడా రెట్టింపు చేసింది. ఈ మేరకు ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్‌ను ప్రస్తుతం రూ.1450గా ఉండగా, దానిని రూ.2200గా పెంచారు. ఐదు కిలోల సిలిండర్‌ డిపాజిట్‌ను రూ.800 నుంచి రూ.1150కి పెంచుతున్నట్టు ఇంధన సంస్థలు ప్రకటించాయి. 
 
అలాగే, ఇక నుంచి సిలిండర్ రెగ్యులేటర్‌కు కూడా రూ.250 వసూలు చేయనున్నారు. ఈ పెంచిన ధరలు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే ఉజ్విల యోజన వినియోగదారులకు మాత్రం ఈ ధరలు వర్తించవని కొత్త కనెక్షన్ తీసుకునే వారే ఒక్త ధరలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.