1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 జూన్ 2022 (20:16 IST)

లవ్ హార్మోన్లు పెంచే ఆహారాలు ఏమిటో తెలుసా?

Love
భార్యాభర్తలు అన్యోన్యంగా, ప్రేమ బంధంతో కాలం గడపాలంటే తగిన లవ్ హార్మోన్లు పెంచే ఆహారాలను తీసుకోవాలట. ఇంతకీ అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

 
సీ ఫుడ్.... విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో కూడిన సాల్మన్ సహజంగా ఆక్సిటోసిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది లవ్ హార్మోన్లను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే చియా సీడ్స్ వంటి సంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో మాత్రమే కాకుండా, ఆక్సిటోసిన్ స్థాయిని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శరీరంలో ఆక్సిటోసిన్ వంటి లవ్ హార్మోన్ తగ్గినప్పుడల్లా చియా విత్తనాలను తిటుండాలి. ఇది ఒత్తిడి- మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

 
అవకాడో తినడం వల్ల లవ్ హార్మోన్ పెరుగుతుంది. ఇది శరీరంలో బలాన్ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఈ పండును పాలతో కలిపి తీసుకోవచ్చు. ఆందోళన రుగ్మతలు వంటి అనేక మానసిక పరిస్థితులను నివారించడానికి అరటిపండు మంచి ఆహార పదార్థంగా పరిగణించబడుతుంది. అరటిపండులో ఉండే మెగ్నీషియం ఆక్సిటోసిన్‌ను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది.

 
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హైపోథాలమస్ నుండి ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను విడుదల చేయడానికి సహాయపడుతుంది. లవ్ హార్మోన్ అంటే ఆక్సిటోసిన్ స్థాయిని పెంచడానికి డార్క్ చాక్లెట్ తినడం చాలా ఆరోగ్యకరమైనదని చెపుతుంటారు.