శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జగనన్న పాలనలో మరో బాదుడు... ఫ్యాన్సీ నంబరు కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలి...

fancy number
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది. వాహనాలకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే ఇప్పటివరకు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇపుడు ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచేసింది. ఈ మేరకు ఏపీ మోటారు వాహన చట్టానికి సవరణలు చేసింది. 
 
వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక రుసుంను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచేసింది. ప్రస్తుతం వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. 
 
అయితే, తాజాగా ఈ రుసుంను రూ.2 లక్షలకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీంతో ఫ్యాన్సీ నంబరు కావాలనుకునేవారు రూ.5 వేల స్థానంలో రూ.2 లక్షలు ప్రాథమిక రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లలో కూడా బాదుడుకు శ్రీకారం చుట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు.