గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 మార్చి 2022 (23:19 IST)

స్నాప్‌డీల్ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌

స్నాప్‌డీల్ భారతదేశంలోని విలువలతో కూడిన దుకాణదారులకు సేవలందించడంపై దృష్టి సారించింది. భారతదేశపు అతిపెద్ద ప్యూర్‌ ప్లే వాల్యూ ఈ-కామర్స్‌ వేదికలలో ఒకటిగా గుర్తింపు పొందిన స్నాప్‌డీల్‌ తమ వ్యాపారంతో పాటుగా వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం, సాంకేతికంగా మరిన్ని ఆవిష్కరణలను చేయడం, పవర్‌బ్రాండ్స్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించడం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలను విస్తరించడం వంటి లక్ష్యాలతో మరోమారు ఐపీఓకు వెళ్లాలని భావిస్తోంది.

 
దీనికోసం, కంపెనీ 1250 కోట్ల రూపాయలను తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటుగా సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లకు చెందిన 30,769, 600 ఈక్విటీ షేర్లను (తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌) విక్రయించాలనుకుంటుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాలలో దాదాపు 900 కోట్ల రూపాయలను ఆర్గానిక్‌ గ్రోత్‌ కార్యక్రమాల కోసం వినియోగించనుంది.
 
 
సాఫ్ట్‌ బ్యాంక్‌, బ్లాక్‌రాక్‌, టెమాసెక్‌, ఈబే, ఇంటెల్‌ క్యాపిటల్‌, నెక్సస్‌ వెంచర్‌ పార్టనర్స్‌, టౌబౌర్న్‌, ఆర్‌ఎన్‌టీ అసోసియేట్లు, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, సీక్వోయా క్యాపిటల్‌ వంటి మొత్తం 71 మంది వాటాదారులలో ఎనిమిది మంది తమ సంబంధిత వాటాలలో కొంత మొత్తం వాటాను ఈ ఐపీఓలో భాగంగా విక్రయిస్తున్నారు. ఈ మొత్తం  కంపెనీ ప్రీ-ఆఫర్‌ ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో  8% కన్నా తక్కువగానే ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఫౌండర్లు కునాల్‌ బాల్‌, రోహిత్‌కుమార్‌ భన్సాల్‌ మాత్రం తమకున్న  20.28% షేర్‌హోల్డింగ్‌లో వాటాలను విక్రరుంచడం లేదని తెలుస్తోంది.