బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (16:07 IST)

విజయవాడ నుంచి వారణాసికి సర్వీసు రద్దు.. స్పైస్ జెట్..

విజయవాడ నుంచి వారణాసికి సర్వీసును రద్దు చేస్తూ స్పైస్ జెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వారణాసికి స్పైస్‌జెట్‌ లేనట్టే. ఆదివారం చివరిగా ఈ సర్వీసు విజయవాడ నుంచి వారణాసికి బయలుదేరుతుంది. స్పైస

విజయవాడ నుంచి వారణాసికి సర్వీసును రద్దు చేస్తూ స్పైస్ జెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వారణాసికి స్పైస్‌జెట్‌ లేనట్టే. ఆదివారం చివరిగా ఈ సర్వీసు విజయవాడ నుంచి వారణాసికి బయలుదేరుతుంది. స్పైస్‌జెట్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విజయవాడ విమానాశ్రయ అధికారులు నివ్వెర పోతున్నారు. 
 
విజయవాడ నుంచి నడిచే విమానాలలో వారణాసికి స్పైస్‌ జెట్‌ బోయింగ్‌ 737 అతిపెద్దది. కాశీకి ఈ సర్వీసును స్పైస్‌ జెట్‌ సంస్థ నెలరోజుల క్రితమే ప్రారంభించింది. ఈ సర్వీసుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ధర కూడా అందుబాటులో ఉండటంతో ఈ సర్వీసుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సగటున 80కి పైగా ఆక్యుపెన్సీతో ఉన్న సర్వీసును స్పైస్‌జెట్‌ రద్దు చేయాలనుకోవటం గమనార్హం.