ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (15:38 IST)

బడా బాబులకు భారీ ఆఫర్.. ఎస్.బి.ఐ రద్దు చేసిన రుణాలు ఇవే... విజయ్ మాల్యాకు రూ.1200 కోట్లు

దేశంలోని బడా బాబులకు భారతీయ స్టేట్ బ్యాంకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎందుకో తెలుసా. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించనందుకు. ఈ ఆఫర్ మొత్తం విలువ కేవలం రూ.7106 కోట్లు మాత్రమే. తాము తీసుకున్న రుణాలన

దేశంలోని బడా బాబులకు భారతీయ స్టేట్ బ్యాంకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎందుకో తెలుసా. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించనందుకు. ఈ ఆఫర్ మొత్తం విలువ కేవలం రూ.7106 కోట్లు మాత్రమే. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేరని భావించిన ఎస్.బి.ఐ.. ఈ రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎస్‌బీఐ రద్దు చేసిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బకాయిదారులు కూడా ఉన్నారు. ఆ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బడా బాబుల్లో... 
విక్టరీ ఎలక్ట్రికల్స్‌- రూ.93.91 కోట్లు, 
కేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ.86.73 కోట్లు 
విక్టరీ ట్రాన్స్‌ అండ్‌ స్విచ్‌ గేర్స్‌ లిమిటెడ్- రూ. 65.57 కోట్లు
ఘనశ్యామ్‌ దాస్‌ జెమ్స్‌& జ్యువెలర్స్‌- రూ. 61.72 కోట్లు
 
తెలంగాణకు చెందిన ఎగవేతదారులు..
ఎస్‌ఎస్‌వీజీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్- రూ.65.24 కోట్లు
యాక్సిస్‌ స్ట్రక్చ్‌ రియల్స్‌- రూ. 51.49 కోట్లు
 
అలాగే, ఎస్‌బీఐ రద్దు చేసిన బకాయిల్లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన 1200 కోట్ల రూపాయలు కూడా ఉండడం గమనార్హం.