సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2020 (21:53 IST)

పీఎంఎస్‌వీఏ నిధి కింద సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మొదటి ఋణం మంజూరు

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) నేడు భారత ప్రధానమంత్రి స్ట్రీట్‌ వెండార్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి పథకం (పీఎంఎస్‌వీఏ నిధి పథకం) కింద తమ మొట్టమొదటి ఋణాన్ని మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ పథకం కింద 10,000 రూపాయల ఋణాన్ని కూరగాయల వ్యాపారి శ్రీమతి ఆశా అశోక్‌ వాల్మీకీకి అందజేశారు. ఈ ఋణ ప్రక్రియ మొత్తాన్నీ డిజిటల్‌గా మరియు ఎలాంటి క్లిష్టత లేకుండా ఉండే రీతిలో బ్యాంక్‌ తీర్చిదిద్దింది.
 
ఆర్‌ భాస్కర్‌ బాబు, ఎండీ అండ్‌ సీఈవో- సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మాట్లాడుతూ, ‘‘పీఎం ఎస్‌వీఏ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు చిన్న మొత్తంలో మూలధన ఋణాలను అందించాలనే పీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ఋణాలను అందించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం. ఈ ఋణాల ద్వారా ఆత్మనిర్భర్‌ పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనుకుంటున్నాం, మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి వారు బయటపడేందుకు ఇది సహాయపడుతుంది.
 
మా వినియోగదారులకు ప్రపంచశ్రేణి బ్యాంకింగ్‌ అనుభవాలను తీసుకురావాలన్నది మా ప్రయత్నం. తద్వారా సమగ్రమైన ఆర్థిక స్థిరత్వం అందిస్తున్నాం. మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలు, వ్యాపారాలకు పలు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది. మా దైన రీతిలో చిరు పాత్రను పోషిచడం పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని అన్నారు.
 
ప్రారంభమైన నాటి నుంచి సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ స్థిరంగా ఆర్ధిక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూనే తమ సేవలను అందిస్తుంది. బ్యాంకింగ్‌ రంగానికి దూరంగా ఉన్న రంగాలకు తగిన సేవలను అందిస్తూనే, పలు పొదుపు, పెట్టుబడి అవకాశాలను గురించి సైతం వారికి అవగాహన కల్పిస్తుంది. అదే సమయంలో పలు ప్రభుత్వ భీమా పథకాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌  మార్గాలనూ  తెలుపుతుంది.
 
సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ)ను ఆస్తులు, బాధ్యతల పరంగా చక్కటి స్థానంలో ఉంచారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ డిపాజిట్లు 300 కోట్ల రూపాయలుగా ఉంటే గ్రాస్‌లోన్‌ పోర్ట్‌ఫోలియో 3700 కోట్ల రూపాయలుగా ఉంది. పరిశ్రమలో అత్యంత సరసమైన వడ్డీరేట్లను ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ అందిస్తుంది. ప్రస్తుతం, సేవింగ్స్‌ ఖాతాలపై 25% వడ్డీ అందిస్తుంటే, ఎఫ్‌డీలపై వినియోగదారులకు 7.5% వడ్డీని అందిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్ల కోసం 8% వడ్డీ రేటు అందిస్తున్నారు.