1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 15 జూన్ 2020 (20:14 IST)

కరోనావైరస్‌తో టాటా మోటార్స్‌కి భారీ నష్టం: రూ. 9,894 కోట్లు

కరోనావైరస్ ధాటికి దేశంలో చాలా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. కోవిడ్ 19 దెబ్బకి వాహనాల అమ్మకాలు బాగా పడిపోయిన నేపథ్యంలో మార్చి త్రైమాసికంలో టాటా మోటార్స్ లిమిటెడ్ (టిఎంఎల్) ఏకీకృత నికర నష్టం రూ 9,894 కోట్లుగా తేలింది. అంతకుముందు ఏడాది కాలంలో కంపెనీ రూ. 1,117 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది.
 
4వ త్రైమాసికంలో కార్యకలాపాల నుండి టిఎంఎల్ యొక్క ఏకీకృత ఆదాయం, 62,493 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 86,422 కోట్లుగా వుంది. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది అది 28% మేర తగ్గింది. కరోనావైరస్ కారణంగా దేశంలోనే కాక అంతర్జాతీయ మార్కెట్లలోనూ టాటా మోటార్స్ ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది.