శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (13:13 IST)

అప్పు తెచ్చుకున్నా.. పెళ్లి చేసుకున్నా పన్ను చెల్లించాల్సిందే : మోడీ సర్కారు నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేయనుంది. ముఖ్యంగా అప్పు తెచ్చుకున్నా.. పెళ్లి చేసు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేయనుంది. ముఖ్యంగా అప్పు తెచ్చుకున్నా.. పెళ్లి చేసుకున్నా.. పన్ను చెల్లించేలా ఈ సవరణలు చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం పెళ్లి ఖర్చులకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసముంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో పడక తప్పదు. 
 
అలాగే, అప్పు తెచ్చుకున్నా.. అది అప్పుగా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందట. అదేవిధంగా ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినా వివరణ ఇవ్వాల్సిందే. లేకుంటే పన్ను కట్టక తప్పదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోళ్లు జరిపితే మాత్రం ఆదాయపన్ను చట్టం వర్తించదు. కాకపోతే ఆ ఆదాయాన్ని నిరూపించలేకపోతే మాత్రం తిప్పలు తప్పవు. 
 
గతేడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్రం తాజాగా ఆదాయ పన్ను సవరణతో మరో షాక్ ఇచ్చింది. తాజా చట్ట సవరణతో వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం వరకు పన్ను కట్టాల్సి ఉంటుందని పేర్కొంది.