బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2024 (22:51 IST)

పామ్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు

palm oil
ఆయిల్ పామ్ చెట్టు యొక్క పండు నుండి తీసుకోబడిన వైవిధ్యమైన, విస్తృతంగా ఉపయోగించే వెజిటేబుల్ నూనె, పామాయిల్. దాని ప్రత్యేక లక్షణాలు, విభిన్న రకాల వినియోగాల కారణంగా ఇది ప్రపంచ వ్యవసాయ, ఆహార పరిశ్రమలలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆయిల్ పామ్ చెట్లు పశ్చిమ ఆఫ్రికాలో 149 సంవత్సరాల క్రితం, 1875లో కనుగొనటం జరిగింది, ఇవి ప్రధానంగా అలంకార ప్రయోజనాల కోసం ఆగ్నేయాసియాకు పరిచయం చేయబడ్డాయి. ప్రస్తుతం, ఇండోనేషియా, మలేషియా సమిష్టిగా ప్రపంచ పామాయిల్ సరఫరాలో 85% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 42 అదనపు దేశాల్లో పామాయిల్ సాగు చేయడం గమనార్హం. ఈ విస్తృత సాగు ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ ఉత్పత్తి యొక్క  ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
 
మలేషియా పామాయిల్ పరిశ్రమ కఠినమైన నిబంధనల కార్యాచరణకు అనుగుణంగా పనిచేస్తుంది, ప్రస్తుతం 15కి పైగా చట్టాలు, నిబంధనలకు లోబడి ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పర్యావరణంపై పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో వివిధ విధానాలు, సాంకేతికతలను అమలు చేయడంపై కొనసాగుతున్న ప్రయత్నాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పద్ధతులు ఆయిల్ పామ్ తోటలు, పామాయిల్ మిల్లులు, శుద్ధి కర్మాగారాలలో విజయవంతంగా నిరూపించబడ్డాయి.
 
వినియోగాలలో వైవిధ్యత :
పామాయిల్ యొక్క వైవిధ్యత పలు పరిశ్రమలలో కనిపిస్తుంది. ఆహార రంగంలో, ఇది అధిక-ఉష్ణోగ్రత వంటకి అనువైన దాని యొక్క ప్రత్యేకమైన సమతుల్య కొవ్వు ఆమ్లాల కూర్పు కారణంగా వంట నూనెలు, వనస్పతి, ప్రాసెస్ చేసిన ఆహారాల కోసం అనువైన నూనెగా నిలుస్తుంది. ఆహారానికి మించి, సబ్బులు, షాంపూలు, సౌందర్య సాధనాల వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులలో సైతం పామాయిల్ వినియోగం కనిపిస్తుంది, దాని వైవిధ్యత, కార్యాచరణ,  స్థిరత్వం, మృదువైన ఆకృతి పరంగా విలువైనదిగా గుర్తించబడుతుంది. 
 
S.N.D.T మహిళా విశ్వవిద్యాలయంలోని హోం సైన్స్&డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విభాగంలో ప్రస్తుతం విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీనా మెహతా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, "పామాయిల్ ఒక వైవిధ్యమైన, ప్రకృతి నుండి పొందిన అనుకూలమైన బహుమతి, ప్రపంచాన్ని పోషించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార ఉత్పత్తిలో దాని అసమానమైన సామర్థ్యం నుండి ఆర్థిక వృద్ధి, గ్రామీణ అభివృద్ధికి దాని సహకారం వరకు పామాయిల్ యొక్క ప్రయోజనాలను హైలైట్ చేయడాన్ని నేను నమ్ముతున్నాను. బాధ్యతాయుతమైన ప్రక్రియలను స్వీకరించడం ద్వారా, మనము పామాయిల్ శక్తిని ఉపయోగించుకోవచ్చు. అందరికీ ఆరోగ్యకరమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును సృష్టించవచ్చు" అని అన్నారు.
 
పోషక విలువలు:
విటమిన్ ఇ, ప్రొవిటమిన్ ఎ (ముఖ్యంగా బీటా-కెరోటిన్) వంటి ముఖ్యమైన పోషకాల యొక్క గొప్ప మూలం, పామాయిల్. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవడం, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడంలో ఈ యాంటీఆక్సిడెంట్లు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనవి. పామాయిల్ యొక్క పోషకాహార ప్రొఫైల్ వివిధ ఆహార ఉత్పత్తులలో దాని ఉపయోగానికి దోహదం చేస్తుంది, ఆహార అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.