సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (12:15 IST)

జనవరి 1 తేదీ నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు..

డెబిట్, క్రిడిట్ కార్డులను వినియోగదారులకు బ్యాంకులు ఓ సూచన చేశాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ కార్డులు జనవరి 1వ తేదీ నుంచి పని చేయవు. ఆర్బీఐ సూచనల మేరకు ఆన్‌లైన్, సైబర్ మోసాలకు అవకాశం లేని కొత్త చిప్, పిన్ బేస్డ్ కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి.


ఇప్పటికే కొన్నిబ్యాంకులు ఇలాంటి కార్టులను తమ వినియోగదారులకు అందించాయి. మిగిలిన బ్యాంకులు ప్రస్తుతం తమ వినియోగదారులకు కొత్త కార్డులను అందజేస్తున్నాయి. 
 
ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా తరచూ కొనేవాళ్లు జరిపే సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ కోడ్ః, ఓటీపీ వంటి గురించి తెలిసేవుంటుంది. వీటి ప్రాధాన్యం తెలియనివారు, తెలిసిన వారు అనేక రకాల మోసాలకు గురవుతున్నారు. 
 
ఆన్‌లైన్ మోసగాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డు వెనుక భాగంలో ఉండే సీవీవీ నెంబర్‌‍ని ఆ కార్డుదారుని ద్వారానే తెలుసుకుని మోసాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్త డెబిట్ కార్డులను జనవరి 1వ తేదీ లోపు బ్యాంకుల నుంచి పొందాలి.

అందుకే కొత్త కార్డులకు సంబంధించిన సమాచారం లేని వారు బ్యాంక్ బ్రాంచ్‌లను సంప్రదించాలి లేదా.. ఆన్‌లైన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చునని బ్యాంక్ అధికారులు తెలిపారు.