బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (16:56 IST)

టీవీఎస్‌ నుంచి ఎన్ టోర్క్ 125 రేస్.. బ్లూటూత్‌ కనెక్టివిటీతో..?

TVS Ntorq 125 Race
టీవీఎస్‌ నుంచి ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లాంఛ్ అయ్యింది. బంగ్లాదేశ్ స్కూటర్‌ మార్కెట్‌లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్‌, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్‌ లుక్‌ దీని సొంతం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్‌ ఇదే. భారతదేశంలో ఈ టీవీఎస్‌ ఎన్ టోర్క్ 125 రేస్ ఎడిషన్ ధర రూ.80,325.
 
స్కూటర్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్‌ పవర్‌, 10.5ఎన్‌ ఎం టార్క్‌, బ్లూ టూత్‌ కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్‌ అసిస్టెంట్‌, ఫుల్లీ-డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది.