ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 జనవరి 2022 (19:21 IST)

మొట్టమొదటిసారిగా గ్రీవియెన్స్‌ రీడ్రెసల్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన అన్‌అకాడమీ

భారతదేశంలో అతిపెద్ద అభ్యాస వేదిక, అన్‌అకాడమీ నేడు భారతదేశంలోని ఎడ్‌టెక్‌ రంగంలో మొట్టమొదటిసారిగా అన్‌అకాడమీ గ్రీవియెన్స్‌ రీడ్రెసల్‌ కౌన్సిల్‌ (యుజీఆర్‌సీ) ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ కౌన్సిల్‌కు సుప్రసిద్ధ విద్యావేత్త, రిటైర్డ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజన్‌ సక్సేనా నేతృత్వం వహించనున్నారు.

 
మూడంచెల పరిష్కారం (రీడ్రెసల్‌)ను యుజీఆర్‌సీ అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ అంటే డబ్బు చెల్లించిన చందాదారులు, అన్‌అకాడమీ యొక్క ఉచిత కంటెంట్‌ వినియోగించుకునే అభ్యాసకులు లేదా సాధారణ వినియోగదారులకు ఇది తెరిచి ఉంచబడుతుంది. యుజీఆర్‌సీ కింద ఫిర్యాదు చేసే అంశాలలో అన్‌అకాడమీ వేదికపై ఉన్న కంటెంట్‌,  ఎడ్యుకేటర్ల ప్రవర్తన, వినియోగదారుల సమస్యలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమం ఇటీవల ప్రభుత్వ సలహాలకు అనుగుణంగా ఉండటంతో పాటుగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే వినియోగేతరులకు కూడా ఈ అవకాశం అందించడం దీనిలో విశిష్టత.

 
‘‘అత్యున్నత నీతివంతమైన ప్రమాణాలతో వ్యాపారాన్ని నిర్వహించగలమనే భరోసాను అన్‌అకాడమీ అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ఉండేలా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. విద్యారంగంలో ఉండటం చేత, జాతి అభివృద్ధిపై మేము చూపగల ప్రభావాన్ని అర్ధం చేసుకున్నాము. ఈ కారణం చేతనే యుజీఆర్‌సీ తో దీని పరిధిని గణనీయంగా విస్తరించడం ద్వారా పరిపాలన పరంగా అత్యున్నత ప్రమాణాలను ఏర్పరుస్తున్నామ. డాక్టర్‌ సక్సేనాను మేము స్వాగతిస్తున్నాము. ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. తద్వారా అత్యంత సమర్థవంతమైన మరియు నమ్మకాన్ని నిర్మించే వ్యవస్ధను రూపొందించడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని గౌరవ్‌ ముంజాల్‌, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవొ, అన్‌అకాడమీ గ్రూప్‌ అన్నారు.

 
అంతర్గత పరిష్కార ప్యానెల్‌లో  వివిధరంగాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉంటాయి. దీనికి సీనియర్‌ అన్‌ అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ నేతృత్వం వహిస్తారు. ఈయనను యుజీఆర్‌సీ కింద ఎంపిక చేస్తారు. వారు తగిన రీతిలో నిర్ణయాలు తీసుకోవడం, పరిష్కార మార్గాలను సూచించడం, దానిని ఫిర్యాదుదారులకు తెలియజేయడం చేస్తారు. ఈ సంఘానికి ఛైర్మన్‌గా డాక్టర్‌ సక్సేనా ఇప్పుడు యుజీఆర్‌సీకి మార్గనిర్దేశనం చేయడంలో బాధ్యత వహిస్తారు. నిర్ధేశిత నియమాలకు కట్టుబడి ఉండేటట్లుగా ఆయన భరోసా కల్పించడంతో పాటుగా సంబంధిత ఫోరమ్స్‌లో యుజీఆర్‌సీకి ప్రాతినిధ్యం వహించనున్నారు.

 
డాక్టర్‌ సక్సేనా అత్యంత సుప్రసిద్ధమైన విద్యావేత్త, రచయిత, మేనేజ్‌మెంట్‌ నిపుణులు. ఆయన గతంలో నిమిమ్స్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయడంతో పాటుగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండోన్‌, ఎస్‌.పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఐక్ఫాయ్‌ గుర్‌గావ్‌లకు పూర్వ డైరెక్టర్‌గా కూడా చేశారు. మార్కెటింగ్‌ మేనేజ్‌ మెంట్‌ రచయితగా కూడా ఆయన సుపరిచితం. ఎన్నో భారతీయ యూనివర్శిటీలలో ఈ పుస్తకాన్ని బోధనాంశంగా తీసుకున్నారు. పలు ప్రభుత్వ కమిటీలలో ఆయన పనిచేయడంతో పాటుగా ఏఐఎంఏ, ఫిక్కీ వంటి అసోసియేషన్‌లలో పరిశ్రమ తరపున పాల్గొన్నారు.

 
ఈ కార్యక్రమం గురించి డాక్టర్‌ సక్సేనా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో గత కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ విద్యకు ఆదరణ గణనీయంగా  పెరుగుతుంది. ప్రతి అభ్యాసకునికీ అందుబాటు ధరలో నాణ్యమైన కంటెంట్‌ అందుతుందన్న భరోసా ఇది అందించింది. ఈ పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతున్న వేళ, వాటాదారుల ప్రయోజనం కాపాడేందుకు సరైన పాలనా యంత్రాంగం ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. యుజీఆర్‌సీతో, అన్‌అకాడమీ ఇప్పుడు బెంచ్‌మార్క్‌ సృష్టించడంతో పాటుగా ఈ దిశగా మరో ముందడుగును వేసింది. యుజీఆర్‌సీ ఛైర్‌గా చేరడం పట్ల ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు