ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 మే 2021 (23:10 IST)

హౌసింగ్‌ డాట్‌ కామ్- ఐఎస్‌బీ హెచ్‌పీఐను విడుదల చేసిన దుర్గా శంకర్‌

సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌  హౌసింగ్‌ డాట్‌ కామ్‌, అంతర్జాతీయ బిజినెస్‌ స్కూల్‌ గా గుర్తింపు పొందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో కలిసి తమ హౌసింగ్‌ ప్రైసింగ్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ)ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగమైన  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆర్థిక కార్యలాపాల సూచిక హెచ్‌పీఐ. వర్ట్యువల్‌గా జరిగిన ఓ సమావేశంలో దీనిని కేంద్ర గృహ, నగర వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన అగ్రశ్రేణి నాయకులతో పాటుగా విద్యావేత్తలు సైతం పాల్గొన్నారు. హెచ్‌పీఐ తమ నెలవారీ నివేదికలను ధరలు, పరిమాణ కదిలికలను దేశవ్యాప్తంగా పలు ప్రోపర్టీ మార్కెట్‌లలో ఏ విధంగా ఉందో తెలుపుతుంది.
 
గురుగ్రామ్‌ కేంద్రంగా కలిగిన డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వెల్లడించే దాని ప్రకారం, హెచ్‌పీఐను ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) శ్రీని రాజు సెంటర్‌ ఫర్‌ ఐటీ అండ్‌ నెట్‌వర్క్డ్‌ ఎకనమీ (ఎస్‌ఆర్‌ఐటీఎన్‌ఈ)తో కలిసి రూపొందించారు. భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాలలో ఆవాసయోగ్యమైన గృహాల ధరలలో వస్తున్న మార్పులను ఒడిసిపట్టేకునే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది.
 
ధరల కదలికలపై ఉపయుక్తమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ సూచిక సహాయంతో, సంభావ్య గృహ కొనుగోలుదారులు తగిన సమయంలో తమకు నచ్చిన గృహాలను కొనుగోలు చేయడానికి తగిన నిర్ణయం తీసుకోగలరు. అదే సమయంలో విక్రేతలకు తమ ఆస్తులను విక్రయించుకోవడానికి మెరుగైన సమయమూ సూచిస్తుంది. విధాన నిర్ణేతలు మరియు ఫైనాన్షియల్‌ ఎనలిటిక్స్‌ సైతం దీనిని ఆధారపడతగ్గ అంచనాగా వినియోగించడంతో పాటుగా ఈ రంగంలో ధోరణులను గుర్తిస్తున్నారు.
 
అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌( ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గ్రేటర్‌ నోయిడా), హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై, పూనెలలో 2017 నుంచి ఇప్పటివరకూ ప్రతి త్రైమాసంలోనూ చేసిన అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఎలారా టెక్నాలజీస్‌ సొంతం చేసుకున్న కంపెనీ యొక్క హెచ్‌పీఐ ఆ ప్రాంతాల సూక్ష్మ ధరలను సైతం వినియోగించుకుంటూనే, భారతదేశంలో ఆ ప్రాంతాల లావాదేవీల విలువ వాటా ఆధారంగా తాము కనుగొన్న 1,2 మరియు 3 బీహెచ్‌కె అపార్ట్‌మెంట్స్‌ ఆధారంగా తదనంతర వెయిట్స్‌ తీసుకుంటుంది. ఈ కారణాల కోసం సమీకరించిన డాటాలో చదరపు అడుగుకు ధర, క్వాంటిటీ, ప్రతి నగరంలోనూ ఉప ప్రాంతాల కోసం గత మూడు నెలలుగా జరిగిన లావాదేవీల మొత్త విలువను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. దీనిలో ఇతర వివరాలైనటువంటి బెడ్‌రూమ్‌ల సంఖ్య, నిర్మాణ స్థితి, ఇన్వెంటరీ యూనిట్ల సంఖ్య కూడా ఉంటాయి.
 
కేంద్ర గృహ మరియు నగర వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్‌ మిశ్రా  మాట్లాడుతూ, ‘‘హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ను ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హౌసింగ్‌ డాట్‌ కామ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దేశపు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆరోగ్యం తెలుసుకునేందుకు అతి చక్కటి సూచికగా ఇది నిలిచే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా ప్రభావితమైంది. ఈ సమయంలో, వృద్ధిని విశ్వసనీయ మార్గాల ద్వారా పరిశీలించడం అవసరం.
 
తద్వారా అధికారులు వేగవంతమైన మరియు సమాచారయుక్త నిర్ణయాలను ఈ తరహా అసాధారణ పరిస్థితులలో తీసుకునేందుకు తోడ్పడుతుంది. 2021 మొదటి త్రైమాసంలో డిమాండ్‌ పెరుగుతుందని మేము గమనించాం, ఈ రంగంలో పునరుద్ధరణ అనేది నెమ్మదిగా ఆరంభమైనదనే సూచికలు కనిపిస్తున్నాయి. గృహ ధరల కదలికలను పర్యవేక్షించడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ ఆర్ధిక వ్యవస్థలో కదలికలను పర్యవేక్షించడానికి ఈ రెండు సంస్థలే భాగస్వామ్యం చేసుకోవడాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను’’ అని అన్నారు.
 
‘‘కొనుగోలుదారులతో పాటుగా విధాన నిర్ణేతలు చాలా వరకూ నాణ్యమైన హై ఫ్రీక్వెన్సీ డాటా లోపించడం మరీ ముఖ్యంగా ప్రాంతపు ఆధారిత సమాచారంలో ఉన్న లోపాల కారణంగా  భారతీయ నగరాల్లో  ప్రోపర్టీ ప్రైస్‌ కదలికలకు సంబంధించి మార్కెట్‌లో ఉన్న ఊహలు, అంచనాలపై ఆధారపడుతుంటారు. హెచ్‌పీఐ ఆవిష్కరణ వెనుక ఉన్న ప్రధానమైన ఆలోచన ఈ సమస్యకు తగిన పరిష్కారం అందించడం. కొనుగోలుదారులకు తగిన సమాచారం అందించడంతో పాటుగా మదుపరులు, విధాన నిర్ణేతలకు సైతం తగిన సమాచారం అందిస్తుంది. మా హెచ్‌పీఐ అందించే సమాచారం రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు పూర్తి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నూతన ప్రాంతాలలో తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవడంలో ఇది తోడ్పడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్ల కోసం, ఈ తరహా సమాచారం అందుబాటులో ఉండటం అనేది గతానికన్నా అత్యంత కీలకంగా ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నేపథ్యంలో డిమాండ్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది...’’ అని ధృవ్‌ అగర్వాల, గ్రూప్‌ సీఈవో, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.