తిరుపతిలో మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రారంభంతో, స్థానిక కమ్యూనిటీలకు బ్యాంకింగ్ సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేలా బ్యాంక్ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించటం కొనసాగిస్తోంది.
ఈ విస్తరణ గురించి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎండి & సీఈఓ, శ్రీ గోవింద్ సింగ్ మాట్లాడుతూ, “తిరుపతిలో మా బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. రాష్ట్రంలో మా కార్యకలాపాలను విస్తరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ బ్యాంకింగ్ అవుట్‌లెట్ ప్రారంభోత్సవం, స్థానిక కమ్యూనిటీలకు బ్యాంకింగ్ సేవలను పొందడంలో మాత్రమే కాకుండా, స్థానిక కమ్యూనిటీలలో ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక చేరిక, సాధికారతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.
పొదుపు, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్‌లు సహా విభిన్నమైన ఆర్థిక ఉత్పత్తులు, సేవల శ్రేణిని తమ కస్టమర్‌లకు అందించే స్థితిలో బ్యాంక్ ఉంది. తన కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి, గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ఆస్తిపై రుణం వంటి వివిధ రుణ ఉత్పత్తులను సైతం బ్యాంక్ అందిస్తుంది.
దాని బ్యాంకింగ్ అవుట్‌లెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బ్యాంకింగ్ సామర్థ్యాలు, ఏటిఎం నెట్‌వర్క్‌తో, బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇది కాకుండా, బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) మరియు కాల్ సెంటర్ వంటి బహుళ ఛానెల్‌లను అందిస్తుంది.
మైక్రో-బ్యాంకింగ్ లోన్‌లు, ఎంఎస్ఎంఈ లోన్‌లు, హౌసింగ్ లోన్‌లు, ఇతర ఆస్తిపై రుణాలతో సహా సమాజంలోని ఇతర విభాగాలకు సేవలందిస్తున్నప్పుడు తక్కువ మరియు సేవలందించని కస్టమర్ విభాగాలకు ఆర్థిక సేవలను అందించడం ఉత్కర్ష్ ఎస్ఎఫ్బిఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, టాబ్లెట్ ఆధారిత అప్లికేషన్ అసిస్టెడ్ మోడల్, “డిజి ఆన్-బోర్డింగ్” ద్వారా బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే బ్యాంక్ ఖాతా తెరవడానికి కస్టమర్లకు బ్యాంక్ సదుపాయాన్ని అందిస్తుంది.