శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (17:48 IST)

విటెరో టైల్స్‌: భారతదేశ వ్యాప్తంగా 56 నూతన షేడ్స్‌ ఆవిష్కరణ

సుప్రసిద్ధ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ బ్రాండ్‌ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ తమ టైల్‌ బ్రాండ్‌, విటెరో టైల్స్‌ కోసం వృద్ధి వ్యూహాలను వెల్లడించింది. దీనిలో భాగంగా విట్రా శీర్షికన నూతన వాల్‌ టైల్స్‌ కలెక్షన్‌ను విడుదల చేసింది. ప్రీమియం నాణ్యత, ఆధునిక డిజైన్‌ మరియు సమకాలీన సౌందర్యంతో తీర్చిదిద్దిన ఈ నూతన సిరీస్‌ విట్రా టైల్స్‌లో 56 రకాల షేడ్స్‌ ఉన్నాయి. ఈ ఆవిష్కరణతో వాల్‌ టైల్స్‌ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 4 సిరీస్‌లు, 400కు పైగా షేడ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా 275కు పైగా డీలర్‌ల ద్వారా విట్రా లభ్యమవుతుంది.
 
ఉత్పత్తి విస్తరణ మరియు వృద్ధి ప్రణాళికలను గురించి శ్రీ అశ్విన్‌ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘గత సంవత్సరం సవాళ్లు ఎదురైనప్పటికీ, విటెరో టైల్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో 13% వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 50% వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాం.
 
మా నూతన ఆవిష్కరణలు వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన ప్రీమియం డిజైన్‌ ఉత్పత్తులను అందిస్తాయి. పోర్ట్‌ఫోలియో నిర్మాణంతో  పాటుగా మేము మా టైల్‌ ఉత్పత్తి సామర్థ్యం సైతం వృద్ధి చేయనున్నాం మరియు దేశ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌ను సైతం వృద్ధి చేయనున్నాం. గత సంవత్సరం మేము మా డీలర్‌ నెట్‌వర్క్‌ను 23% వృద్ధి చేస్తే ఈ సంవత్సరం మరో 30% వృద్ధి చేయనున్నాం’’ అని అన్నారు.
 
శైలి మరియు పనితీరుల ఖచ్చితమైన సమ్మేళనంగా ఉన్న విట్రాను ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురం వద్ద అత్యాధునిక తయారీ కేంద్రంలో నానో సాంకేతికత వినియోగించి తయారుచేస్తున్నారు. ఈ టైల్స్‌ ఉత్పత్తిలో దాదాపు 60% ముడిపదార్థాలను అంతర్గతంగా తయారుచేస్తున్నారు. ఈ విట్రా టైల్స్‌ 300x300 ఎంఎం మరియు 300x600 ఎంఎం పరిమాణాలలో వస్తున్నాయి.