శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:43 IST)

ఈ సెప్టెంబర్‌లో ఉత్సాహపూరితమైన ఆఫర్లను ప్రకటించిన యమహా

Yamaha
ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) నేడు ప్రత్యేక ఆఫర్లను సెప్టెంబర్‌ నెల కోసం తమ ఉత్సాహపూరితమైన, ఆకర్షణీయమైన, స్పోర్టీ శ్రేణి మోడల్స్‌పై ప్రకటించింది. ఈ ఆఫర్లు 30 సెప్టెంబర్‌ 2022 వరకూ లభిస్తాయి.
 
ఈ ఆఫర్లలో భాగంగా....
 
1. మోడల్‌ ఎఫ్‌జెడ్‌-ఎఫ్‌ఐ
 
· క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ 3000/– రూపాయలు (ఒడిషా,పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌, తమిళనాడు)
 
· క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 5000/– రూపాయలు (కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాలలో లభ్యం)
 
2. మోడల్‌ : ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ
 
· క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ 3000/– రూపాయలు  (ఒడిషా,పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్‌, తమిళనాడు)
 
· క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 5000/– రూపాయలు (కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో లభ్యం)
 
3. ఫైనాన్స్‌ పథకం
 
· యమహా వాహనాల కొనుగోలు కోసం ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ పథకాలను ఎంచుకున్న వినియోగదారులు 3వేల రూపాయల విలువ కలిగిన బోట్‌ ఎయిర్‌ పాడ్స్‌ (భారతదేశ వ్యాప్తంగా లభ్యం) పొందగలరు.
 
రాబోతున్న పండుగలను పురస్కరించుకుని యమహా తమ మొత్తం శ్రేణి ద్వి చక్రవాహనాలపై భారతదేశ వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఆఫర్లను అందిస్తుంది. ‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ ’బ్రాండ్‌ ప్రచారం ద్వారా యమహా ఇప్పుడు ప్రీమియం శ్రేణి  మోటర్‌సైకిల్‌ మరియు  స్కూటర్‌ మోడల్స్‌ను ప్రచారం చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల షాపింగ్‌ అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా బ్రాండ్‌తో వారి బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకుంది.