బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-09-2022 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తే...

astro11
మేషం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగులు అవమానాలను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం :- భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది.
 
కర్కాటకం :- ముఖ్యులతో మాటపట్టింపులు వచ్చే ఆస్కారం ఉంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. అదనపు బరువు భాద్యతలను స్వీకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం.
 
సింహం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించక పోవటంతో ఆందోళనకు గురవుతారు. స్త్రీలలో అసహనం, అశాంతి చోటుచేసుకుంటాయి. సన్నిహితులతో కలిసిచేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది.
 
కన్య :- మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఓర్పు, రాజీ ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల :- ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడంవల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగుచూస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. 
 
ధనస్సు :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత, మెళుకువ వహించండి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఊహించని రీతిలో ధన లబ్ది పొందుతారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం ఉంది.
 
మకరం :- ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం పొందుతారు. కళాకారులకు పురోభివృద్ధి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
కుంభం :- ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు.
 
మీనం :- చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తత అవసరం. కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. బంధువులను కలుసుకుంటారు.