1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-09-2022 ఆదివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని పూజించిన...

Astrology
ఆదివారం సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం:- కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగం మాని వ్యాపారాలు చేయడం మంది కాదని గమనించండి. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
వృషభం :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలియికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి.
 
మిధునం:- ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం:- వాస్తవానికి మీరు నిదానములైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.రిప్రజెంటిస్లేకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు, బంగారం సమకూర్చుకుంటారు.
 
సింహం:- పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బంధువుల రాకతో గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సున్నితంగా వ్యక్తం చేయండి.
 
కన్య:- కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. సోదరీ, సోదరు మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది.
 
తుల:- స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల మెళుకువ అసవరం.
 
వృశ్చికం:- ఆర్ధికంగా బాగుగా స్థిరపడతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ చాలా అవసరం.
 
ధనస్సు: - స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. లౌక్యంగా పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం:- బంధువుల రాక వల్ల ఆకస్మిక ఖర్చులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం:- స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఎంతో ఆంనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం:- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.