సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-09-2022 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి..

astro4
మేషం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కుల జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది.
 
వృషభం :- వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరుచూ పర్యటనలు, ఒత్తిడి అధికం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి.
 
మిథునం :- వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విదేశీయాన యత్నాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. అవివాహితులకు శుభదాయకం. ఆరోగ్యం కుదుటపడుతుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. సంప్రదింపులు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
కన్య :- వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఆకస్మిక ధన లాభం, కార్యసిద్ధి. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సమసిపోతుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. ప్రయాణం కలిసివస్తుంది. ఇతరుల ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. హామీలు, నగదు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వైద్యులకు బాధ్యతల్లో అలక్ష్యం మంచిదికాదు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధు మిత్రులకు సహాయ సహాకారాలందిస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రుణ వాయిదాలు, పన్నులు, ఫీజులు సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
మకరం :- ఉద్యోగస్తుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. రాజకీయాల్లో వారికి పదవులు, సభ్యత్వాలకు మార్గం సుగమమవుతుంది. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు.
 
కుంభం :- ఉద్యోగస్తులు గుట్టుగా ప్రమోషన్ యత్నాలు సాగించాలి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందిస్తారు.
 
మీనం :- ఆదాయం సంతృప్తికరం. రుణవిముక్తికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. గృహనిర్మాణ పనులు ప్రారంభంలో మందగించినా క్రమేణా వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకంగా ఉంటుంది.