శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (11:42 IST)

ఉద్యోగాల పండగే, 2.62 ఉద్యోగాలు, ఏయే శాఖల్లోనో తెలుసా?

తాజా బడ్జెట్టులో మోదీ సర్కార్ వేసిన మరో భారీ అంచనా ఉద్యోగాల కల్పన. 2019-21 మధ్య కాలంలో 2.62 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఐతే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి అదే వేరే వ్యవహారం. కానీ ఎన్డీఏ మాత్రం తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
 
వాస్తవానికి 2019 మార్చి 1 నాటికి ప్రభుత్వ సంస్థల్లో 32,62,908 మంది ఉద్యోగులు వున్నారు. ఈ సంఖ్య 2021 మార్చి 1 నాటికి  35,25,388కి చేరుతుందని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 మార్చి నాటికి కొత్తగా 2.62 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నమాట. ప్రభుత్వం వేస్తున్న అంచనాలు ఫలిస్తే ఉద్యోగాల కోసం రోడ్ల మీద తిరిగే యువత భవిష్యత్తులో కనిపించదు మరి.
 
ఈ ఉద్యోలు ఈ శాఖల్లో...
పోలీస్‌ విభాగంలో 79,352
రక్షణరంగంలో 22,046
హోంశాఖలో 8,200
సాంస్కృతికశాఖలో 3,886
అంతరిక్ష విభాగంలో 3,903
రెవెన్యూ శాఖలో 3,243
ఎర్త్‌సైన్సెస్‌లో 2,581
విదేశాంగశాఖలో 2,167
పర్యావరణ శాఖలో 2,136
ఎలక్ట్రానిక్స్‌, ఐటీలో 1,347
అటామిక్‌ ఎనర్జీలో 2,300
వ్యవసాయ శాఖలో 1,766
సమాచార, ప్రసారశాఖలో 1600
సిబ్బంది మంత్రిత్వ శాఖలో 2,684 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది.