1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By CVR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (18:17 IST)

పిల్లల బూట్లు కొంటున్నారా... జాగ్రత్త..!

స్కూల్స్ తెరవగానే కొత్త డ్రెస్, కొత్త బూట్లతో ముచ్చటగా స్కూల్‌కి వెళుతున్న పిల్లలను చూసి మురిసిపోని తల్లిదండ్రులు ఉండరు. అయితే పిల్లలు తమ బూట్లు నొప్పిపెడుతున్నాయని ఆరు నెలలు తిరగకుండానే అనడం విని ఆశ్చర్యపోతారు. మొన్ననే కదా కొన్నాం అని కోపం తెచ్చుకోవచ్చు కూడా. కాని పిల్లల పాదాలు ఆరు నెలల్లోనే పెరుగుతాయి.
 
బిగుతుగా ఉండే బూట్లు మహాబాధిస్తాయి. అవి మార్చకపోతే పాదాల రూపంలో తేడా వచ్చినా వస్తుంది. అందుకే పిల్లలకు బూట్లు కొనేటప్పుడు పిల్లల కాలి పాదాన్ని బట్టి, సైజును కొలిచి మరీ కొనుగోలు చేయడం అవసరం. అందుకని మరీ బిగుతుగా ఉండేవి సెలక్ట్ చేయడం మంచిది కాదు. షూలో పాదం పెట్టిన తర్వాత, వేళ్ళకి ముందు కనీసం ఒక సెంటీ మీటర్ ఖాళీ ఉండేలా చూసుకుని, నడిచేందుకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకోవాలి.
 
అదే విధంగా షూ వెనుక వైపు కూడా గాలి పోయేంత గ్యాప్ ఉండడం అవసరం. షూ అడుగు భాగంలో మెత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. లేకుంటే చిన్న వయసులోనే పాదాలకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో పిల్లలు ఇళ్లలో కంటే కూడా ఎక్కువ సమయం స్కూళ్లలోనే గుడుపుతున్నారు. కనుక షూలు కొనడంలో మరింత జాగ్రత్త అవసరం.