Daily Horoscope
✕

బాదం-జీడిపప్పులతో పూరీ ఎలా?

జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. జీడిపప్పులో కాపర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇ

Written By selvi
Updated: గురువారం, 28 జూన్ 2018 (15:51 IST)
జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. జీడిపప్పులో కాపర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. పిల్లలకు ఇదెంతో మేలు చేస్తుంది. 
 
జీడిపప్పులో లభించే జింక్‌.. ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది. అలాగే బాదం పప్పులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్- ఇ అధికంగా ఉన్న బాదం పప్పులు గుప్పెడు తింటే వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రెండింటిని పిల్లలు అలాగే తినేందుకు ఇష్టపడకపోతే.. వేడి వేడి పూరీలతో కలిపి ఇవ్వడం చేయండి. బాదం, జీడిప్పులతో పూరీ ఎలా చేయాలో చూద్దాం..  
 
కావలసినవి 
రవ్వ- పావు కప్పు 
గోధుమపిండి - అర కిలో
నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు,
బాదం పొడి- అర కప్పు
జీడిపప్పు పొడి - అర కప్పు 
నూనె - తగినంత 
 
తయారీ విధానం:
గోధుమపిండి మిశ్రమంలో నెయ్యి వేసి కలపాలి. తరవాత బాదం, జీడిపప్పు పొడిని కలిపి చపాతీపిండిలా కలపాలి. పిండిముద్దమీద తడిబట్ట కప్పి 15 నిమిషాలు పక్కనబెట్టాలి. వీటిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనీ పూరీలా చేసి వేడైన నూనెలో పూరీల్లా కాల్చాలి. ఇరువైపులా పూరీలు బ్రౌన్‌గా వచ్చాక ఆయిల్ లేకుండా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని.. హాట్ హాట్‌గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.

అన్నీ చూడండి

యూట్యూబ్ సాయం : అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

పిఠాపురంలో రెబెల్స్ షాకిచ్చారు.. అభ్యర్థుల ఎంపికలో సమస్య ఉందా?

ఓటుకి రూ.1000 ఇచ్చి ఓడిపోయా, నా డబ్బు నాకివ్వండి... లేదంటే: వైసిపి అభ్యర్థి ప్రసాద్

ఉద్యోగులకు దీపావళి బహుమతిగా ఐఫోన్ 17

సాలూరు మున్సిపల్ ఎన్నికలు.. 300 ఓట్ల మెజారిటీతో జనసేన..హడావుడిగా పెళ్లి చేసుకున్నా నిరాశే

అన్నీ చూడండి

Rakesh Varre: మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాయలేడి చూసి ఎంజాయ్ చేస్తారు : రాకేష్ వర్రే

ప్రతిదానికి సినిమాను బలిపశువును చేస్తున్నారు : సందీప్ రెడ్డి వంగా

లైఫ్ లో బిజీగా గడుపుతూ జ్ఞాపకాలు కోల్పోతున్నాం. అందుకే సమ్మర్ హాలిడేస్ వస్తుంది

Neha Shetty: మదరాసి రబ్బరుబొమ్మ నేహా శెట్టి తో టైసన్ నాయుడు ప్రోమో సిద్ధమైంది

Nagarjuna, Tabu: అందమైన టబు కోసం కింగ్ 100 గ్లింప్స్ రిలీజ్ చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments