మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (09:41 IST)

ఫలూదా తయారీ విధానం....

ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
ఐస్ర్కీమ్‌ - 1 స్పూన్ 
పాలు - పావు లీటర్
రోజ్ సిరప్ - 45 గ్రాములు
నూడల్స్ - 40 గ్రాములు
పిస్తా - 40 గ్రాములు
అక్రోట్ - 1/2 స్పూన్ (సన్నని ముక్కలు)
సబ్జి గింజలు - 1 స్పూన్ ( నానబెట్టినవి)
 
తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పొడవాటి గాజు గ్లాసులో 30 మి.లీ.ల రోజ్‌ సిరప్‌ను వేసి దానిలో నూడుల్స్‌ను, సబ్జి గింజలను వేయాలి. తరువాత పాలను నూడుల్స్‌ మునిగేలా పోయాలి. ఇప్పుడు ఐస్ర్కీమ్‌ను కూడా వేశాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి మిగతా 15 మి. లీ. రోజ్‌ సిరప్‌ను పైన పోసుకోవాలి. అంతే ఫలూదా రెడీ.