గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (15:41 IST)

ఉసిరి జామ్‌ తయారీ విధానం...

వేసవిలో దొరికే ఈ ఉసిరికాయతో ఆరోగ్యానికి ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చును. ఇందులో విటమిన్స్ శాంతం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ఉసిరికాయతో జామ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

వేసవిలో దొరికే ఈ ఉసిరికాయతో ఆరోగ్యానికి ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చును. ఇందులో విటమిన్స్ శాంతం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ఉసిరికాయతో జామ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
ఉసిరి తురుము - 1 కప్పు
నీళ్ళు - పావు కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - 1/2 స్పూన్
దాల్చిన చెక్క- అంగుళం ముక్క.
 
తయారీ విధానం:
దళసరి అడుగున్న పాత్రలో ఉసిరి తురుము, పంచదార, నీళ్ళు తీసుకొని, పంచదార కరిగేవరకు ఉడికించాలి. లేత తీగపాకం వచ్చే ముందు మంట తగ్గించి యాలకుల పొడి, దాల్చిన చెక్క వేసి మరో మూడు నిమిషాలు పాటు అలానే ఉంచాలి. తరువాత పాత్రను దించేయాలి. మిశ్రమం చల్లారిన తరువాత దాల్చిన చెక్క తీసేసి, గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. బ్రెడ్‌పైనే కాకుండా, పరగడుపున అర టీ స్పూన్ చొప్పున లేహ్యంగా తీసుకున్నా కూడా ఆరోగ్య రీత్యా మంచిది.